
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్, కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎంపికచేయకపోవడాన్ని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. అసలు ఉమ్రాన్ మాలిక్‌ను తప్పించారా? లేక రెస్ట్ ఇచ్చారా? అని ప్రశ్నించాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ సరిగ్గా ఆలోచించి ఉంటే ఉమ్రాన్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్ చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమ్రాన్.. ఆ మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసాడు. రెండో టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు సమర్పించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లలో 56 పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత మిగిలిన రెండు టీ20ల్లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
తాజాగా వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2 టీ20 మ్యాచుల్లో మాత్రమే ఆడించిన టీమ్ మేనేజ్‌మెంట్, అతన్ని తప్పించడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. 'ఉమ్రాన్ మాలిక్‌కు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చోటు లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్‌కు రెస్ట్ ఇచ్చారా? లేక తప్పించారా? రెండు మ్యాచుల్లోనే అద్భుతం చేయాలంటే జరిగేది కాదు. కనీసం అతనితో మాట్లాడారా? కాస్త మంచి మేనేజ్‌మెంట్ ఉండి ఉంటే... ఉమ్రాన్ మాలిక్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
తొలుత అతనికి అన్నీ టీమ్స్‌లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్నింటి నుంచి తప్పించారు. వెస్టిండీస్ టూర్‌కి పంపించకుండా జింబాబ్వే టూర్‌కి పంపాలని అనుకుంటున్నారా?. భారత జట్టు తరుపున ఆడడానికి అతను రెఢీగా ఉన్నాడని మీరు భావిస్తే వరుస అవకాశాలు ఇవ్వండి. అతను రెడీగా లేకపోతే జట్టుకి సెలక్ట్ చేయడం ఎందుకు? మళ్లీ టీమ్ నుంచి తప్పించడం ఎందుకు.' ఆకాశ్ చోప్రా ఘాటుగా వ్యాఖ్యానించాడు.