For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే.. మళ్లీ టీమిండియాకు ఎంపికవుతాడు'

Aakash Chopra says A good IPL can bring Dinesh Karthik back in the reckoning for Indias T20 team

ముంబై: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే మళ్లీ టీ20ల్లో టీమిండియాకు ఎంపికయ్యే అవకాశముందని భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే కార్తిక్‌ అలా చేయగలడా అనేదే ప్రశ్నగా మిగిలిందని‌ ఆకాశ్‌ పేర్కొన్నాడు . తాజాగా అతడు ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఒకతను కార్తిక్‌పై అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు.

కార్తిక్‌ అలా చేయగలడా:

కార్తిక్‌ అలా చేయగలడా:

టీ20ల్లో ఐదో స్థానంలో రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే ఇంకా తమ స్థానాలను భర్తీ చేసుకోనందున దినేశ్‌ కార్తిక్‌కు అవకాశం ఉందా? అని ఓ అభిమాని ఆకాశ్‌ చోప్రాను అడిగాడు. దానికి చోప్రా జవాబిస్తూ.. 'మీరు చెప్పేది నిజమేనని నేనూ కూడా అనుకుంటున్నా. దినేశ్‌ కార్తిక్‌ కచ్చితంగా తిరిగి జట్టులోకి రాగలడు. కానీ అతను ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించాలి. అతడలా చేయగలడా లేదా అనేదే అసలైన విషయం' అని పేర్కొన్నాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలి:

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలి:

'దినేశ్‌ కార్తిక్‌ మొదటగా చేయాల్సిన పని కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలి. ఎందుకంటే ప్రస్తుతం అతడు మిడిల్‌ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. అక్కడ బ్యాటింగ్‌ చేస్తే ఎక్కువ పరుగులు చేయలేదు. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తే పరుగులు చేయవచ్చు. అలా కాకుండా కెప్టెన్‌గా ఉన్నానని ఐదో స్థానంలోనే ఆడితే తగినన్ని పరుగులు చేయలేడు. అయితే కార్తీక్ కీపర్‌గానూ రాణిస్తున్నాడు. కానీ టీమిండియా ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌లు కీపర్‌, బ్యాట్స్‌మెన్లుగా‌‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడాలంటే.. డీకే కచ్చితంగా రెండు ఐపీఎల్‌లలో రాణించాలి' అని ఆకాష్ చోప్రా తెలిపాడు.

2018లో జట్టు పగ్గాలు:

2018లో జట్టు పగ్గాలు:

టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్..‌ కేకేఆర్ కెప్టెన్‌గా తప్పుకున్నాక దినేశ్‌ కార్తిక్‌ 2018లో ఆ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో గత రెండు సీజన్లలో ఆడిన కోల్‌కతా.. పెద్దగా రాణించలేకపోయింది. సమిష్టిగా రాణించలేక మూల్యం చెల్లించుకుంది. ఈసారైనా మరింత మంచి ప్రదర్శన చేయాలని కేకేఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో డీకే ఇప్పటివరకు 24 టెస్టుల్లో, 94 వన్డేల్లో, 32 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 182 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.

ఆ విమానం ఎక్కడానికి ఏదైనా చేస్తా: అండర్సన్‌

Story first published: Friday, August 28, 2020, 21:15 [IST]
Other articles published on Aug 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+