Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra: డబ్ల్యూటీసీ ఫైనల్ రేటింగ్స్.. షమీ 7/10.. పుజారా 2/10.. కోహ్లీ, రోహిత్‌కు ఎన్ని మార్కులంటే?

Aakash Chopra rates Indian players’ performance in WTC Final against New Zealand
WTC Final: Sanjay Manjrekar Takes Dig At Ravindra Jadeja Again | Oneindia Telugu

హైదరాబాద్: 144 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. గత రెండేళ్లుగా సాగిన ఈ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. కీలక ఫైనల్లో మాత్రం తడబడి టైటిల్‌ను చేజార్చుకుంది. గత బుధవారం ముగిసిన ఈ మెగా ఫైనల్లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి 'టెస్ట్ కింగ్'గా నిలిచింది.

అయితే ఈ ప్రతిష్టాత్మక టైటిలో పోరులో భారత్ చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమి నేపథ్యంటో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 10 మార్కులకుగాను రేటింగ్ ఇచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా తుది జట్టులోని 11 మంది ఆటగాళ్ల మార్కుల వివరాలను వెల్లడించాడు.

రోహిత్ శర్మకు 6 మార్కులు..

రోహిత్ శర్మకు 6 మార్కులు..

స్టార్ ఓపెనర్, రోహిత్ శర్మ పెర్ఫామెన్స్‌కు ఆకాశ్ చోప్రా 6 మార్కులు ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని, కానీ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించలేకపపోయాడన్నాడు. అతనికి కేవలం 4 మార్కులు మాత్రమే ఇచ్చాడు. 'నేను రోహిత్‌కు 6/10 మార్కులు ఇస్తాను. ఎందుకంటే అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు.

సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు సహకారం అందించిన గిల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో త్వరగా ఔటయ్యాడు. దాంతో అతనికి కేవలం 4/10 రేటింగే ఇస్తున్నా.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

పుజారాకే లోయెస్ట్..

పుజారాకే లోయెస్ట్..

ఇక టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తీవ్రంగా నిరాశపరిచాడని, అతను బాగా రాణిస్తాడనుకున్నామని తెలిపాడు. 'భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయలేకపోయాడు. అందుకే అతనికి నేను 2/10 అతి తక్కువ రేటింగ్ ఇస్తున్నాను.'అని తెలిపాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, కానీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమయ్యారని తెలిపాడు. ఈ ఇద్దరు మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఇద్దరికి 5/10 రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో రాణించినప్పటికీ చోప్రా అతనికి 5/10 రేటింగే ఇచ్చాడు.

 అశ్విన్‌కు 6.. జడేజాకు 3 మార్కులు..

అశ్విన్‌కు 6.. జడేజాకు 3 మార్కులు..

ఆల్‌రౌండ్ స్పిన్నర్ల రవిచంద్రన్ అశ్విన్‌కు 6/10 రేటింగ్ ఇచ్చిన చోప్రా.. జడేజాకు మాత్రం కేవలం 3/10 రేటింగే ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ 4 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడని, కానీ తన సహచర స్పిన్నర్ జడేజా మాత్రం బ్యాటింగ్, ఫీల్డింగ్ రెండింటిలో విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు.

ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో సత్తాచాటిన మహమ్మద్ షమీకి 7/10 రేటింగ్ ఇచ్చిన చోప్రా.. ఇషాంత్ శర్మ 6/10 మార్కులు వేసాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క వికెట్ తీయని బుమ్రాకు మాత్రం మూడు మార్కులు వేసాడు. ఇక చోప్రా డబ్ల్యూటీసీ ఫైనల్ రేటింగ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

చోప్రా డబ్ల్యూటీసీ ఫైనల్ మార్కులు..

చోప్రా డబ్ల్యూటీసీ ఫైనల్ మార్కులు..

1. రోహిత్ శర్మ 6/10

2. శుభ్ మన్ గిల్ 4/10

3. చతేశ్వర్ పుజారా 2/10

4. విరాట్ కోహ్లీ 5/10

5. అజింక్యా రహానే 5/10

6. రిషభ్ పంత్ 5/10

7. రవీంద్ర జడేజా 3/10

8. రవిచంద్రన్ అశ్విన్ 6/10

9. ఇషాంత్ శర్మ 6/10

10 మహమ్మద్ షమీ 7/10

11 జస్‌ప్రీత్ బుమ్రా 3/10

Story first published: Friday, June 25, 2021, 15:11 [IST]
Other articles published on Jun 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+