Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్ష్మణ్.. ఇదేం బౌలింగ్ కాంబినేషన్? శివమ్ దూబే ఐదో బౌలరా?: మాజీ క్రికెటర్

టీమిండియా బౌలింగ్ కాంబినేషన్‌పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం ఏంటని ప్రశ్నించాడు. శివమ్ దూబేను ఐదో బౌలర్‌గా పరిగణలోకి తీసుకుంటున్నారా? అని నిలదీసాడు. జింబాబ్వే పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వరుసగా 6 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అయిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు.. జింబాబ్వేపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

అందుకే రజత్ పాటిదార్‌కు అవకాశం ఇవ్వడం లేదు: ఆకాశ్ చోప్రా

అందుకే రజత్ పాటిదార్‌కు అవకాశం ఇవ్వడం లేదు: ఆకాశ్ చోప్రా

శివమ్ దూబేపై అంత నమ్మకమా..?

ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా.. టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరం లేదా? అని ప్రశ్నించాడు. ' భారత జట్టు కేవలం నలుగురు బౌలర్లతోనే ఆడింది. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్‌లను మాత్రమే జట్టులోకి తీసుకుంది. ఐదో బౌలర్‌గా శివమ్ దూబేను పరిగణనలోకి తీసుకుంటున్నారా? మరి ఆరో బౌలర్ ఎవరంటే ఎవరు లేరు. ఆరో బౌలర్ లేకుండానే ఆడాలని టీమిండియా నిర్ణయించుకుంది.

Aakash Chopra questions VVS Laxman Shreyas Iyer Despite India s Dominant Win Over Zimbabwe

శివమ్ దూబే నాలుగు ఓవర్లలో 32 పరుగులే ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసాడు. అది కూడా డీప్‌లో క్యాచ్ అందుకున్నారు. అతను నాలుగు ఓవర్లు వేసేలా సిద్దం చేస్తున్నారు. ఇండియా నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగుతుందంటే.. శివమ్ దూబేపై చాలా నమ్మకం ఉంచినట్లు అర్థమవుతుంది. అయితే ఇది చాలా పెద్ద విషయమని నేను భావిస్తున్నా.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

India Playing XI: ఆ యువ ప్లేయర్‌పై వేటు.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI: ఆ యువ ప్లేయర్‌పై వేటు.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

భారత్ కోచ్‌గా లక్ష్మణ్..

తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన శివమ్ దూబే..జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాను ఔట్ చేశాడు. జింబాబ్వే పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అతని సపోర్ట్ స్టాఫ్‌కు విశ్రాంతి కల్పించడంతో బీసీసీఐ సీఓఈ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆసియా గేమ్స్ 2026లో కూడా లక్ష్మణ్ భారత జట్టును నడిపించనున్నాడు. శ్రీలంకతో ఆగస్ట్‌లో జరిగే టెస్ట్ సిరీస్‌తో గంభీర్ మళ్లీ తిరిగి టీమిండియా‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Saturday, July 25, 2026, 10:18 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+