IPL 2027: రూ.14.20 కోట్ల ఆటగాడిపై వేటు.. సీఎస్‌కే రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2027 సీజన్ మినీవేలానికి సమయం ఆసన్నమవుతుండటంతో ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ జాబితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు బీసీసీఐ నవంబర్ 15 డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న గోవా వేదికగా ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. దాంతో ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ జాబితాలపై అంచనాలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) రిటైన్, రిలీజ్ జాబితాలను టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేసాడు. రూ.14.20 కోట్ల రికార్డ్ ధరతో కొనుగోలు చేసిన స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను సీఎస్‌కే వేలంలో వదిలేస్తుందని చెప్పాడు. ప్రశాంత్ వీర్.. 6 మ్యాచ్‌లు ఆడి 67 బంతుల్లో 90 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసాడు. అతనితో పాటు మ్యాట్ షార్ట్‌ను కూడా సీఎస్‌కే రిలీజ్ చేస్తుందని చెప్పాడు.

గత సీజన్‌లో సీఎస్‌కేకు బెస్ట్ ప్లేయర్ జేమీ ఓవర్టన్ అని చెప్పాడు. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో పాటు 158.14 స్ట్రైక్‌రేట్‌తో 136 పరుగులు చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు లోయరార్డర్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.
ఇక అతి తక్కువ ధరతో జట్టులోకి అకీల్ హోసెన్ వచ్చాడని, కానీ బౌలింగ్ అదరగొట్టాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. 7 మ్యాచ్‌లు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. 8.02 ఎకానమీతో 8 వికెట్లు తీసాడు. అతను ఆడిన 7 మ్యాచ్‌ల్లో చెన్నై 5 గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన కూడా అంత బాగా లేకపోయినా.. కెప్టెన్, ఓపెనర్‌గా అతని స్థానానికి డోకా లేదని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఐదుసార్లు విజేత అయిన సీఎస్‌కే.. వరుసగా మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలిచి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ధోనీ, నాథన్ ఎల్లిస్ గాయాలతో దూరమవ్వడం.. ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్ సీజన్ మధ్యలో తప్పుకోవడం చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
