Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే కేకేఆర్ కొంపముంచింది: ఆకాశ్ చోప్రా

Aakash Chopra points out KKR tactical blunders after Morgan and Co loss against RR

న్యూఢిల్లీ: విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ మూల్యం చెల్లించుకుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడగున నిలిచింది. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన ఆకాశ్ చోప్రా.. ఇయాన్ మోర్గాన్ సేన చేసిన టాక్టికల్ ఎర్రర్స్‌ ఏంటో చెప్పుకొచ్చాడు.

రస్సెల్ పవర్ తెలుసుకోవాలి..

రస్సెల్ పవర్ తెలుసుకోవాలి..

'ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ వ్యూహాల్లో ఘోర తప్పిదాలు చేసింది. దాంతోనే మూల్యం చెల్లించుకుంది. వెనువెంటనే వికెట్లు కోల్పోయినప్పుడు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్‌ను ముందుగా బ్యాటింగ్ పంపించకుండా ఘోర తప్పిదం చేసింది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ వచ్చి అతను విధ్వంసం సృష్టించినా కోల్‌కతా అతని బలాన్ని గుర్తించలేకపోయింది. నేను అయితే రస్సెల్‌నే బ్యాటింగ్ పంపించేవాడిని. అతను వీలైనన్ని బంతులు ఆడితే అంత ఎక్కువ పరుగులు చేయగలడనే విషయాన్ని కేకేఆర్ గ్రహించడం లేదు.

బ్యాటింగ్‌లో పవర్ లేదు..

బ్యాటింగ్‌లో పవర్ లేదు..

కేకేఆర్ హ్యాంగోవర్‌లో ఉంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు శుభారంభం అందుకోలేదు. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. వారి పవర్ ప్లే బ్యాటింగ్‌లో పవర్ కనిపించలేదు. ఈ వికెట్ నెమ్మదిగా ఆడేది ఏ మాత్రం కాదు. శుభ్‌మన్ గిల్ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. నితీష్ రాణా ఏదో ప్రయత్నిస్తున్నాడు. శుభ్‌మన్ రనౌటవ్వడంతో కేకేఆర్‌ పవర్ ప్లే ముగిసింది. ప్రత్యర్థి బౌలింగ్ అద్భుతంగా ఉంది. కాదనలేను. కానీ పరుగులు చేయలేనంత కష్టంగానైతే లేదు. కేకేఆర్ బ్యాట్స్‌మన్ వేగంగా ఆడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

చెలరేగిన మోరిస్..

చెలరేగిన మోరిస్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (26 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. క్రిస్‌ మోరిస్‌ (4/23) బంతితో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (41 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. మిల్లర్‌ (23 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Story first published: Sunday, April 25, 2021, 17:04 [IST]
Other articles published on Apr 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+