
ఈ సీజన్‌తో క్లారిటీ..
ఐపీఎల్ 2020 సీజన్‌లో కేఎల్ రాహుల్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడు. భవిష్యత్‌లో భారత్‌ను ఎలా నడిపిస్తాడనే విషయాలపై చోప్రాను ప్రశ్నించగా.. ఈ విధంగా బదులిచ్చాడు. రాహుల్ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తనకుందని చెప్పాడు. అతని కెప్టెన్సీ భవితవ్యం ఈ సీజన్ ఐపీఎల్‌తో క్లారిటీ రానుందన్నాడు.
పంజాబ్‌ను జట్టును ఎలా ముందుకు తీసుకెళతాడు, ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తాడనే విషయాలు తెలుస్తాయన్నాడు.

రోహిత్, కోహ్లీ కూడా..
‘అతను కెప్టెన్‌గా రాణిస్తాడనే నమ్మకం నాకుంది. అతని సారథ్యంపై ఈ సీజన్ ఐపీఎల్‌తో ఓ అవగాహన రానుంది. అతను పరుగులు ఎలా చేస్తాడు. ఎలాంటి వ్యూహాలు రచిస్తాడనేదానిపై క్లారిటీ రానుంది. కోహ్లీ, రోహిత్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కోహ్లీ, రోహిత్ ఒకే వయసు కలవారు. ఒక స్థాయికి వచ్చేసరికి వారిద్దరు కెప్టెన్లుగా కనిపించారు.

ఏదో ఒక రోజు తప్పుకోవాల్సిందే..
కెప్టెన్సీ విషయంలో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎలాగైతే జట్టు పగ్గాలను కోహ్లీకి అప్పగించాడో.. అలాగే అతడు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి ఇవ్వక తప్పదు. అప్పుడు కేఎల్ రాహుల్ మాత్రమే ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే రాహుల్ కెప్టెన్‌గా ఎలా పనికొస్తాడనే విషయం ఈ ఐపీఎల్‌తో తెలుస్తుంది. ఇప్పటివరకూ అతడి ఆట, వ్యవహారశైలిని బట్టి కెప్టెన్‌గా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మంచి సారథిగా గుర్తింపు సాధిస్తాడు. 'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

టైటిలే లక్ష్యంగా..
ఇక గత 12 సీజన్లలో కింగ్స్ పంజాబ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. స్టార్ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఒకే సారి ఫైనల్‌కు చేరిన కింగ్స్ పంజాబ్.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. మరో ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే క్యాష్ రిచ్ లీగ్ కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అన్ని విధాలుగా సమాయత్తం అవుతుంది. కొత్త కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో నూతన కెప్టెన్ రాహుల్ సారథ్యంలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆదివారం న్యూఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2020 సీజన్ జర్నీ ప్రారంభించనుంది.


Click it and Unblock the Notifications
