
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్..
లీగ్‌లో దంచికొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన ఆకాశ్ చోప్రా.. అతనికి జోడీగా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌ల్లో 32.15 సగటుతో 418 పరుగులే చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందనే ఈ జోడీకి ఆకాశ్ చోప్రా ప్రాధాన్యత ఇచ్చాడు.

రాహుల్ త్రిపాఠి, సూర్యకు చాన్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన రాహుల్ త్రిపాఠిని ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా ఎంపిక చేసిన ఆకాశ్ చోప్రా.. సూర్యకుమార్ యాదవ్‌కు నాలుగో స్థానంలో తీసుకున్నాడు. 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 37.55 సగటుతో 413 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. గాయాలతో సతమతమైన సూర్యకుమార్ యాదవ్ 8 మ్యాచ్‌ల్లో 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. సూర్య సైతం మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..
ఐపీఎల్ 2022 సీజన్‌లో తనదైన సారథ్యంతో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తన టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఆకాశ్ చోప్రా సారథిగా ఎంపిక చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి మేటి ఆల్‌రౌండర్‌ను తలపించిన హార్దిక్.. టీమిండియాను నడిపించగలడని చెప్పాడు. ఇక ఆర్‌సీబీ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి కార్తీక్ 2.oగా కనిపించిన దినేశ్ కార్తీక్‌ను వికెట్ కీపర్‌గా తీసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్పిన్ ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యాను తీసుకున్నాడు. బ్యాటింగ్‌తో మెరిసిన రవిచంద్రన్ అశ్విన్ పేరు విస్మరించాడు.

ఉమ్రాన్ మాలిక్‌ను నో చాన్స్..
150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్‌కు ఆకాశ్ చోప్రా పట్టించుకోలేదు. దిగ్గజ క్రికెటర్లంతా ఉమ్రాన్ టీమిండియా భవిష్యత్తని చెబుతుంటే చోప్రా మాత్రం అతని పెర్ఫామెన్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లను తీసుకున్న చోప్రా.. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌లను పేసర్లుగా ఎంపిక చేశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన దీపక్ హుడాతో పాటు బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నాడు.

ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన టీ20 ప్రపంచకప్ భారత జట్టు:
కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా


Click it and Unblock the Notifications












