
మ్యాక్స్‌వెల్‌కు మంచి ధర..
ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌కు మంచి ధర పలుకుతుందని ఆకాశ్ చోప్రా చెప్పకొచ్చాడు. ఈ ఆస్ట్రేలియా స్టార్ గత సీజన్‌లో దారుణంగా విఫలమైనా.. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతాయన్నాడు. 'ఇది మినీ వేలం అయినా మ్యాక్స్‌వెల్ రావాల్సిన డబ్బు వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ సీజన్‌లో కూడా అతనికి మంచి ధర దక్కుతుంది. మ్యాక్స్‌వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తీవ్రంగా పోటీపడుతాయి. దాంతో అతను మళ్లీ మంచి ధర పలకనున్నాడు. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించడం మ్యాక్స్‌వెల్‌కు లాభం చేకూర్చింది. గతేడాది ధర కన్నా ఎక్కువే ఈసారి రావొచ్చు.'అని తెలిపాడు.

షకీబ్ అల్ హసన్ కూడా..
బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా భారీ ధర పలికే చాన్సుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఐసీసీ నిషేధం కారణం షకీబ్ అల్ హసన్ గత సీజన్ ఆడని విషయం తెలిసిందే. అయితే షకీబ్ కోసం పంజాబ్ కింగ్స్ అలియాస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీవ్రంగా పోటీపడే అవకాశం ఉందన్నాడు. 'షకీబ్ అల్ హసన్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఆసక్తి కనబరుస్తాయి. ఎందుకంటే అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయగల మంచి ఆల్‌రౌండర్. మ్యాక్స్‌వెల్‌ను వదులుకున్న పంజాబ్.. షకీబ్ కోసం గట్టిగా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఆ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్నర్ కొరత ఉంది. షకీబ్‌ను తీసుకుంటే వారి జట్టుకు కావాల్సిన కాంబినేషన్ లభిస్తుంది.'అని తెలిపాడు.

ముగ్గురిలో ఒకరికి..
డేవిడ్ మలాన్, జై రిచర్డ్సన్, నాథన్ కౌల్టర్ నీల్‌ల కోసం కూడా ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. మలాన్, ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్‌లో ఒకరు భారీ ధరకు అమ్ముడుపోతారని అంచనా వేశాడు. అలానే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్‌కు కూడా మంచి ధర పలికే అవకాశం ఉందన్నాడు.
'డేవిడ్ మలాన్‌ను కేకేఆర్ తీసుకోవచ్చు. అతనితో పాటు జాసన్ రాయ్, ఆరోన్ ఫించ్‌ల కేకేఆర్, చెన్నై, ఆర్‌సీబీ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. పేర్లు వచ్చేదాని బట్టి ఈ ముగ్గురిలో ఒకరకి భారీ ధర పలకవచ్చు.

ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్..
జై రిచర్డ్సన్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడే చాన్స్ ఉంది. ఎందుకంటే చాలా జట్లకు ఫాస్ట్ బౌలర్ల అవసరం ఉంది. ముంబై, పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ జట్లకు ఫాస్ట్ బౌలర్ల అవసరం ఉంది. కాబట్టి రిచర్డ్సన్ కోసం ఈ మూడు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అలాగే నాథన్ కౌల్డర్ నైల్, క్రిస్ మోరీస్‌ల కోసం కూడా ఫ్రాంచేజీలు పోటీపడుతాయి. ఈ ఐదుగురు ప్లేయర్ల గురువారం జరిగే వేలంలో భారీ ధర పలుకుతారు. కింగ్స్ పంజాబ్, సీఎస్‌కే, ఆర్‌సీబీలే మధ్యనే తీవ్ర పోటీ ఉంటుంది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












