Asia Cup 2023 Best XI: కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు నో చాన్స్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా.. ఆసియా కప్ బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం కల్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసియాకప్ టోర్నీ గురించి మాట్లాడిన ఆకాష్ చోప్రా.. తన బెస్ట్ ఎలెవన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు చోటివ్వలేదు.
'ఆసియాకప్ బెస్ట్ ఎలెవన్ తొలి ఓపెనర్ రోహిత్ శర్మ. నా కెప్టెన్ కూడా అతనే. రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఒక్కసారి డకౌటైనా.. మిగతా మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. సెకండ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్. అతనికి దారిదాపుల్లో మరో ఓపెనర్ లేడు. ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, పాతుమ్ నిస్సంకా, దిముత్ కరుణరత్నే, మహమ్మద్ నైమ్, రెహ్మానుల్లా గుర్బాజ్‌ల్లో ఎవరూ కూడా గిల్‌లా రాణించలేదు.

నెంబర్-3లో కోహ్లీ, కుశాల్ మెండీస్ మధ్య పోటీ నెలకొంది. అయితే నేను కుశాల్ మెండీస్‌కే చోటిస్తున్నాను. కోహ్లీ కంటే అతనే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ కంటే అతనికే ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అతను సుమారుగా 275 రన్స్ చేశాడు. నెంబర్ 4లో కేఎల్ రాహుల్‌ను తీసుకున్నా. అతని సెంచరీ చేయడంతో పాటు తర్వాతి మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించాడు.
నెంబర్ 5లో మహమ్మద్ రిజ్వాన్‌ను ఎంచుకున్నా. అతను ఈ ఆసియా కప్‌లో నిలకడగా రాణించాడు. ఈ బెస్ట్ ఎలెవన్ కీపర్ కూడా అతనే. నెంబర్ 6లో ఇఫ్తికర్ అహ్మద్‌ను ఎంచుకున్నా. అయితే హార్దిక్ పాండ్యాకు చోటివ్వాలి. కానీ అతని కంటే ఇఫ్తికర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. నెంబర్ 7లో శ్రీలంక స్పిన్ సెన్సేషన్ దునిత్ వెల్లలాగేను ఎంచుకున్నా.

అతనికి పోటీగా మరే ఆటగాడు లేడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. షాదాబ్ ఖాన్, షకీబ్ అల్ హసన్ కూడా వెల్లలాగే కంటే మెరుగైన ప్రదర్శన చేయలేదు. నెంబర్ 8లో షాహిన్ షా అఫ్రిదిని ఎంచుకున్నా. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను సత్తా చాటాడు. శ్రీలంక మ్యాచ్‌లోనూ కీలక వికెట్లు తీసాడు.
9వ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకున్నా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 10లో మతీష పతీరణను తీసుకున్నాను. ఈ టోర్నీలో అతనే టాప్ వికెట్ టేకర్. 11వ ప్లేయర్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఎంచుకున్నా. అతను సెన్సేషనల్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications