Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్‌ల్లో పాకిస్థాన్ ప్రదర్శన దారుణం.. గ్రేస్ మార్క్స్ కలిపినా నో యూజ్: మాజీ క్రికెటర్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 సైకిల్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ ప్రదర్శనపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. ఈ రెండు జట్లు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చాయని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌కు గ్రేస్ మార్క్స్ కలిపినా తిరిగి పుంజుకోలేని పరిస్థితి ఉందని విమర్శించాడు.

ఇంగ్లండ్ టీమ్ బజ్‌బాల్ ఆటతో అభిమానులను అలరించినా.. జట్టుగా సాధించిందేం లేదన్నాడు. ఇప్పటి వరకు ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయిందన్నాడు. జట్ల ప్రదర్శన ఆధారంగా డబ్ల్యూటీసీ సైకిల్‌లోని జట్లను రెండు డివిజన్లుగా విభజించాలని ఐసీసీకి సూచించాడు.

ఇంగ్లండ్ సాధించిందేం లేదు..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ఇంగ్లండ్, పాకిస్థాన్ ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'డబ్ల్యూటీసీలో ఇంగ్లండ్ ప్రదర్శన దారుణం. బజ్‌బాల్ గేమ్‌తో ఆ జట్టు జనాలను ఎంటర్‌టైన్ చేస్తుంది తప్పా సాధించిందేం లేదు. టెస్ట్ క్రికెట్‌ను ఆదరించే ఏకైక దేశం ఇంగ్లండ్. టెస్ట్ మ్యాచ్‌లకు కూడా స్టేడియాలన్ని నిండిపోతాయి. కిక్కిరిసిన అభిమానులతో ప్రతీ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కార్యక్రమంలా కనిపిస్తోంది. కానీ, ఇంత మద్దతు ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.

Aakash Chopra mocks Pakistan for being bottom-placed in World Test Championship takes swipe at England

ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో రెండు సైకిల్స్ ముగిసాయి. కానీ ఈ రెండు సైకిల్స్‌లో ఇంగ్లండ్ ఫైనల్ చేరేందుకు దారిదాపుల్లో కూడా రాలేదు. ప్రస్తుత సైకిల్‌లో ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తర్వాత వెస్టిండీస్, పాకిస్థాన్ మాత్రం ఉన్నాయి. పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ విన్నింగ్ పర్సంటేజ్ 6 మాత్రమే. ఇది చాలా పేలవమైన ప్రదర్శన. ఎంత దారుణమంటే.. పాకిస్థాన్ జట్టుకు గ్రేస్ పాయింట్స్‌ కలిపినా పుంజుకోలేని పరిస్థితి నెలకొంది.

రెండు డివిజిన్లుగా విభజించాలి..

ఈ ఫలితాలను చూస్తుంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ప్రమోషన్, రిలెగేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అనిపిస్తోంది. 12 టెస్ట్ దేశాలను రెండు గ్రూపులుగా విభజించాలి. అగ్రస్థానంలో ఉన్న 6 జట్లు మొదటి డివిజన్‌లో ఆడగా.. చివరి 6 జట్లు రెండో డివిజన్‌లో పోటీపడాలి. ప్రతీ డబ్ల్యూటీసీ సైకిల్ ముగింపులో రెండో డివిజన్‌లోని ఉత్తమ జట్లు తదుపరి డివిజన్‌కు అర్హత సాధించేలా చేయాలి.'అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

Story first published: Tuesday, August 4, 2026, 19:11 [IST]
Other articles published on Aug 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+