కోహ్లీని విలన్‌ని చేద్దామనుకుంటున్నారా.. మీరలా చేయలేదా?


హైదరాబాద్: పెర్త్ వేదికగా రెండో టెస్టు ముగిసిపోయింది. దాని ఫలితం తేలి టీమిండియా ఓడిపోవడంతో బాక్సింగ్ డే టెస్టుకు సైతం తలపడేందుకు ఇరు జట్లు ఇప్పటికే సిద్ధమైపోతున్నాయి. అయినా.. కెప్టెన్ కోహ్లీకి ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌కి మధ్య పెర్త్ వేదికగా చెలరేగిన వివాదం మాత్రం చల్లారటం లేదు. వారిద్దరూ ఇది మామూలు విషయమేనని కొట్టిపడేసినా మాజీలు, సీనియర్లు మాత్రం ఏదో వాఖ్యలు చేస్తూ వాళ్లను ప్రశంసిస్తూనో విమర్శలు గుప్పిస్తూనో.. స్పందిస్తూనే ఉన్నారు.

పెర్త్ వేదికగా అమర్యాదగా ప్రవర్తించాడని
ఈ క్రమంలో ఆసీస్ మాజీలు, అక్కడి మీడియా సైతం కోహ్లీ, టీమిండియా ఆటగాళ్లను కించపరిచేలా కథనాలు రాస్తోంది. ఓవైపు కోహ్లీ పెర్త్ వేదికగా అమర్యాదగా ప్రవర్తించాడని ఆసీస్ మాజీలు ఆరోపిస్తుంటే..మరోవైపు టీమిండియా మాజీలు, సీనియర్లు కోహ్లీకి మద్దతుగా నిలిచి ఇవన్నీ మామూలే అంటూ కొట్టిపరేస్తున్నారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం కోహ్లీకి మద్దతుగా మాట్లాడారు.

కోహ్లీని విలన్‌గా చిత్రీకరించాలని చూస్తూ
‘ఆసీస్ మీడియా టీమిండియాపై కక్ష కట్టినట్లుంది. ప్రపంచ జట్ల ముందు టీమిండియా ఆటగాళ్లను ముఖ్యంగా కోహ్లీని విలన్‌గా చిత్రీకరించాలని చూస్తోంది. మీడియా, ఆసీస్ మాజీలు ఇలా ప్రవర్తించడం పట్ల ఆశ్చర్యమనిపిస్తోంది. ఆసీస్ ఆటగాళ్లెప్పుడూ ఇంతకు ముందు అలా ప్రవర్తించలేదా? ఒక సారి ఆసీస్ మీడియా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. వ్యక్తిగతంగా కోహ్లీ అంటే ఏంటో నాకు తెలుసు. అతడి జట్టును దగ్గరుండి పరిశీలించాను. వారిలో ఎక్కడా తప్పు కనిపించలేదు. టీమిండియా ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించినట్లు అనిపించలేదు. ఆసీస్ మీడియా అనవసరంగా ఓవరాక్షన్ చేస్తోంది' అని ఆకాశ్ చోప్రా మండిపడ్డారు.
'కోహ్లీ ఉద్రేకపూర్వక వైఖరి మంచిదే'

బాక్సింగ్ డే టెస్టు టార్గెట్‌గా
ఇరు జట్ల మధ్య రసవత్తరంగా సాగనున్న బాక్సింగ్ డే టెస్టు భారీ అంచనాల మధ్య మొదలుకానుంది. మెల్‌బౌర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి మూడో టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను దాదాపు ప్రకటించేశాయి. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సమమైన బలాలతో ఉన్నాయంటూ గంగూలీ, పాంటింగ్ వంటి దిగ్గజాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications