Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ ఆటను చూస్తే ఆ దిగ్గజ వికెట్ కీపర్‌ గుర్తొచ్చాడు: ఆకాశ్ చోప్రా

Aakash Chopra heaps praise on Pant after his return to form in India vs Australia A tie
Ind v Aus : Rishabh Pant Has Only Gone As a Tourist To Australia Till Now'

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా -ఏతో జరిగిన పింక్ బాల్ సన్నాహక మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తిరిగి ఫామ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన చోప్రా.. పంత్ ఆట చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ గుర్తుకొచ్చాడన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఆపై కంగారూలు 108 పరుగులు చేశారు. ఇక శనివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడగా పృథ్వీషా(3) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ అందుకున్నారు.

విహారి, పంత్ సెంచరీలు..

విహారి, పంత్ సెంచరీలు..

హనుమ విహారి( 194 బంతుల్లో 13 ఫోర్లు 104), రిషభ్‌ పంత్‌( 73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103) శతకాలతో మెరవగా, మయాంక్‌ అగర్వాల్‌(120బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), శుభ్‌మన్‌గిల్‌ (78 బంతుల్లో 10 ఫోర్లతో 65) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్‌ 386/4 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించిన ఆకాశ్‌చోప్రా.. బ్యాట్స్‌మెన్‌ అంతా రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు.

 టచ్‌లోకి మయాంక్

టచ్‌లోకి మయాంక్

తొలుత మయాంక్‌ అగర్వాల్‌ గురించి ప్రస్తావిస్తూ.. అతను ఆస్ట్రేలియాలోనే కెరీర్‌ ఆరంభించాడని, కీలక సమయంలో పరుగులు చేసినందుకు అభినందించాలన్నాడు. ‘హాఫ్ సెంచరీతో మయాంక్ ఫామ్‌ అందుకున్నాడు. ఇంకా పరుగుల దాహంతో ఉన్నాడు. ఇప్పుడు శతకం బాదకపోయినా ఫర్వాలేదు. కానీటెస్టు మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు సాధించాలి'అని చోప్రా ఆకాంక్షించాడు.

పంత్ ఆట సూపర్.

పంత్ ఆట సూపర్.

ఇక రిషభ్‌పంత్‌ బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. ఆట చివర్లో అతను అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మెరుపు శతకం బాదాడన్నాడు.‘పంత్‌ క్రీజులోకి వచ్చేసరికే హనుమ విహారి చాలా ముందున్నాడు. అలాంటిది మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి ఇద్దరూ శతకాలు సాధించారు. ఈ ఆటలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా తాను మొదట విహారిని అనుకున్నాను. అయితే.. పంత్‌ తన ఆటతో ఆ అభిప్రాయాన్ని మార్చాడు. అతని ఆట ఆసీస్ గొప్ప వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను తలపించింది. ఒక్క సెషన్‌లో పంత్‌ ఆట స్వరూపాన్ని మార్చేస్తాడు'అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Story first published: Sunday, December 13, 2020, 18:26 [IST]
Other articles published on Dec 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+