IND vs SL: వీడు జడేజాకే మొగుడిలా ఉన్నాడు: మాజీ క్రికెటర్
టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. రవీంద్ర జడేజాకు మానవ్ సుతార్ అప్‌డేటేడ్ వర్షన్ అని కొనియాడాడు. శ్రీలంకతో తొలి టెస్ట్‌లో మానవ్ సుతార్ ఇప్పటికే 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 2 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో రెండో టెస్ట్‌లోనే మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో భారత్ విజయానికి 6 వికెట్ల దూరంలో నిలిచింది.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మానవ్ సుతార్ బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. రవీంద్ర జడేజాకు అప్‌గ్రేడ్ వర్షన్ అంటూ కొనియాడాడు. టీమిండియా ఆసియా ప్రణాళికల్లో మానవ్ సుతార్ భాగంగా మారిపోయాని, బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో విదేశాల్లో కూడా ఆడిస్తారని చెప్పుకొచ్చాడు. కేవలం బౌలర్‌గా చూస్తే.. జడేజాకు అప్‌డేటెడ్ వర్షన్ అని చెప్పుకొచ్చాడు.

అప్‌డేటేడ్ ప్లేయర్..
'మానవ్ సుతార్ చాలా పవర్‌ఫుల్ ఆటగాడు. అతను బౌలింగ్ చేసినప్పుడు బంతి పక్కకు వెళ్తూ.. బౌన్స్ అవుతూ టర్న్ అవుతుంది. బ్యాటర్లు డిఫెండ్ చేయబోతే ఔటవుతున్నారు. ఒక బ్యాటర్ డిఫెండ్ చేస్తున్నప్పుడు పదే పదే ఇబ్బంది పెట్టగలిగితే ఆ బౌలర్ సత్తా ఏంటో తెలుస్తుంది.
మానవ్ సుతార్‌కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది. విదేశీ పర్యటనలకు కూడా అతన్ని ఎంపిక చేయవచ్చు. నేను అతన్ని రవీంద్ర జడేజాకు వారసుడిగా చూస్తున్నా. ఎందుకంటే జడేజా ఏదో ఒక దశలో ఆటకు వీడ్కోలు పలుకుతాడు. అప్పుడు అతనిలాంటి వాడి అవసరం ఉంటుంది. నేను అతన్ని కేవలం బౌలర్‌గా చూస్తే.. మానవ్ సుతార్‌కు అప్‌డేటేడ్ వెర్షన్ అని భావిస్తున్నా. క్రికెట్ నేపథ్యం ఏ మాత్రం లేని శ్రీ గంగానగర్ వంటి ప్రాంతం నుంచి వచ్చి భారత్ తరఫున ఆడిన తొలి టెస్ట్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం గొప్ప విషయం. 'అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 84/4 (ధనంజయ డిసిల్వా 31 బ్యాటింగ్, సోనాల్ దినుషా 25 బ్యాటింగ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
