For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలా అయితే కష్టమే.. సాహాకు పంత్ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడు: చోప్రా

Aakash Chopra feels Rishabh Pant might be used as a concussion substitute for Wriddhiman Saha

సిడ్నీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ ‌పంత్‌ ఇప్పటివరకు ఆస్ట్రేలియా సిరీస్‌కు ఓ పర్యాటకుడిలా వెళ్లినట్లు ఉందని మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా పేర్కొన్నాడు. అతడు జట్టుతో కొనసాగడం కూడా ఓ సమస్యగా మారనుందన్నాడు. ఈ యువ బ్యాట్స్‌మన్‌ ప్లేయింగ్ లెవెన్‌లో ఆడకుండా జట్టుతో కొనసాగితే.. వృద్ధిమాన్ సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడని చోప్రా జోస్యం చెప్పాడు. వాస్తవానికి పంత్ గతేడాది నుంచి సరైన ప్రదర్శన చేయట్లేదు. ఇప్పటికే టీ20, వన్డే జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా సెటిల్ అవ్వడంతో పంత్‌కు అవకాశమే లేకుండా పోయింది.

 చివరి స్థానంలో ఉన్నాడు:

చివరి స్థానంలో ఉన్నాడు:

తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిమానులతో మాట్లాడాడు. 'రిషబ్ పంత్‌ తిరిగి జాతీయ జట్టులోకి ఎప్పుడొస్తాడని అనుకుంటున్నారు' అని ఓ నెటిజన్‌ అడగ్గా.. 'ఇదో కష్టతరమైన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వికెట్‌ కీపర్ల జాబితాలో పంత్‌ చివరి స్థానంలో ఉన్నాడు. కోహ్లీసేనకు అతడిని ఆడించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా-ఎ మ్యాచులో పంత్‌ను ఆడించొచ్చు. ఐదుగురికి బదులుగా ఆరుగురు బ్యాట్స్ మెన్ ఆడవచ్చు. ఆరో బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాల్సి ఉండేది. ఆ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌గా సాహాను కొనసాగించినా.. పంత్‌కు అవకాశం కల్పించాల్సింది' అని అన్నాడు.

సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌ల్లోనూ టీమిండియా రిషబ్ పంత్‌ను ఆడించలేదని, దాంతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు అతడో పర్యాటకుడిలా వెళ్లాడని ఆకాష్ చోప్రా విమర్శించాడు. పంత్ ఇలానే జట్టుతో కొనసాగడం కూడా ఓ సమస్యగా మారనుందని తెలిపాడు. పంత్‌ అలాగే జట్టుతో కొనసాగితే.. వృద్ధిమాన్ సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడని.. దాంతో అటు టీమిండియాకు, ఇటు దేశవాళీ ఆడే అవకాశం కోల్పోతాడని చోప్రా చెప్పాడు. 2021 ఐపీఎల్‌ అయ్యేంత వరకు అతడు మళ్లీ జాతీయ జట్టులో కనపడే అవకాశం లేదని జోస్యం చెప్పాడు.

 సెంచరీ చేస్తే:

సెంచరీ చేస్తే:

రిషబ్ పంత్ తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌ వరకు వేచి చూడాలని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021లో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంటేనే మళ్లీ అవకాశం లభిస్తుందని ఈ మాజీ క్రికెటర్‌ చెప్పాడు. ఒకవేళ రాబోయే టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కితే.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదృష్టం కొద్దీ సెంచరీతో కదం తొక్కితే ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సులువు కాదన్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పంత్‌‌ మోస్తారుగా రాణించిన విషయం తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన అతడు ఒకే ఒక్క అర్ధ శతకంతో 343 పరుగులు చేశాడు.

మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లు:

మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లు:

వాస్తవానికి పంత్‌ మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు.. టీమిండియాకు ఎంపికైన మొదట్లో దూకుడైన ఆటతీరును చూసి మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు సంపాదిస్తారని అంతా భావించారు. కానీ రానురాను పంత్‌ ఆటతీరులో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించేది. ఎదో మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లుగా అతని షాట్లు ఉండేవి. ఆట కీలకదశలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా వికెట్‌ సమర్పించుకునేవాడు. పంత్ విఫలమవుతుంటే.. ఇదే సమయంలో కేఎల్‌ రాహుల్‌ నిలకడైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఒకవైపు వికెట్ కీపింగ్.. మరోవైపు బ్యాటింగ్ అండతో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇక పంత్‌ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరం చేసింది.

మళ్లీ ముంబై ఇండియన్స్‌కు పార్థివ్‌ పటేల్.. ఈసారి ఆటగాడిగా కాదు!!

Story first published: Friday, December 11, 2020, 10:48 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+