
జడేజా అర్హుడు..
ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో జడేజా(175 నాటౌట్) అజేయ శతకంతో పాటు 9 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా జడేజాపై ప్రశంసల జల్లు కురిపించిన ఆకాశ్ చోప్రా.. అతనికి ఏ+ గ్రేడ్ ఎందుకు ఇవ్వలేదని బీసీసీఐని ప్రశ్నించాడు. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాకి రూ.7 కోట్లు చొప్పున సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో దక్కనుంది.
ఈ A+ గ్రేడ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. కానీ.. ఎందుకు ఈ గ్రేడ్‌లో రవీంద్ర జడేజా లేడు? కచ్చితంగా ఈ A+ గ్రేడ్‌లో జడేజా ఉండాల్సింది. తప్పకుండా తదుపరి కాంట్రాక్ట్‌లో జడేజా పేరు ఈ టాప్ గ్రేడ్‌లో ఉంటుంది. అతనే కాదు.. కేఎల్ రాహుల్ కూడా ఈ గ్రేడ్‌కు అర్హుడు'' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ప్రదర్శన ఆధారంగా గ్రేడ్స్..
భారత క్రికెటర్లకు ఇచ్చే వార్షిక వేతనాలను బీసీసీఐ గ్రేడ్-ఎ+, గ్రేడ్-ఎ, గ్రేడ్-బి, గ్రేడ్-సి రూపంలో నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. ఇందులో మూడు ఫార్మాట్లు రెగ్యూలర్‌గా ఆడే ఆటగాళ్లకు గ్రేడ్-ఎ+లో చోటు కల్పించి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం ఇస్తోంది. అలానే గ్రేడ్-ఎలోని ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్-బిలోని ఆటగాళ్లకి రూ.3 కోట్లు, గ్రేడ్-సిలోని ప్లేయర్లకు రూ. 1 కోటి ఇస్తోంది.

సిరాజ్‌కు ప్రమోషన్
బీసీసీఐ 2022-23 కాంట్రాక్టుల్లో మహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్ లభించగా.. చతేశ్వర్ పుజారా, రహానే, ఇషాంత్ శర్మలకు డిమోషన్ లభించింది.
సిరాజ్ సి నుంచి బీ గ్రేడ్‌కు మారగా.. . నిలకడ లేమితో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మలను సెంట్రల్ కాంట్రాక్టులో 'ఎ' నుంచి 'బి' విభాగానికి డిమోట్ అయ్యారు. గతేడాది 'ఎ'లో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా 'సి'కి పడిపోయారు.
గతేడాది 'ఎ'లో పదిమంది చోటు దక్కించుకోగా.. ఈసారి కేఎల్ రాహుల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లతో ఐదుగురు మాత్రమే అందులో కొనసాగుతున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాకు 'సి' కాంట్రాక్టు ఇచ్చారు. నిలకడగా రాణించలేకపోతున్న మయాంక్ అగర్వాల్ 'బి' నుంచి 'సి'కి డిమోట్ అయ్యాడు.

బీసీసీఐ 2022-23 కాంట్రాక్టులు..
ఎ+ (ఏడాదికి రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ ,బుమ్రా
ఎ (రూ.5 కోట్లు): అశ్విన్, జడేజా, పంత్, కేఎల్ రాహుల్, షమి
బి (రూ.3 కోట్లు): పుజారా, రహానె, ఇషాంత్, శ్రేయస్, అక్షర్ పటేల్, సిరాజ్, శార్దూల్
సి (రూ.1 కోటి): ధావన్, హార్దిక్ పాండ్య, సాహా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, చాహల్, శుభ్‌మన్ గిల్, విహారి, మయాంక్, సూర్యకుమార్, ఉమేశ్, భువనేశ్వర్.


Click it and Unblock the Notifications












