Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20లో ఓడినా.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్: ఆకాశ్ చోప్రా

ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓడినా.. రెండో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మినహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. దాంతో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తొలి టీ20లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వైఫల్యం నేపథ్యంలో రెండో టీ20లో వైభవ్ ఆడటం పక్కా అని మెజార్టీ అభిమానులు అనుకుంటున్నారు.

కానీ వైభవ్ సూర్యవంశీని ఆడించే పరిస్థితి లేదని, తానైతే అతన్ని బెంచ్‌కే పరిమితం చేస్తానని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లో ఒకర్ని తప్పించలేనని తెలిపాడు.

IND vs IRE: ఆ విషయంలో మేం విఫలమయ్యాం: అభిషేక్ శర్మ

IND vs IRE: ఆ విషయంలో మేం విఫలమయ్యాం: అభిషేక్ శర్మ

'తదుపరి మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలా వద్దా అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ పరుగులు చేయలేదు. అభిషేక్ శర్మ మినహా ఎవరూ రాణించలేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Aakash Chopra Explains Why He Won t Debut Vaibhav Sooryavanshi in 2nd T20I Despite India Losing 1st T20I

ఇది రాజకీయంగా తప్పుగా అనిపించవచ్చు. కానీ నేను మాత్రం అతన్ని ఇంకా బెంచ్‌పైనే కూర్చోబెడుతా. వైభవ్ కోసం సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకర్ని జట్టు నుంచి తీసేయలేను. నేను అదే టాప్ త్రీ బ్యాటర్లను బరిలోకి దించి, ఈసారి భిన్నమైన ఫలితాన్ని ఆశిస్తాను. వచ్చే మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే 250 పరుగులు కూడా చేయవచ్చు. భారత్ ఆ విధంగా బ్యాటింగ్ చేయగలదు. ఎందుకంటే భారత బ్యాటర్లకు ఆ సామర్థ్యం ఉంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

తొలి టీ20 టీ20లో అభిషేక్ శర్మ(49) మినహా అంతా విఫలమయ్యారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సంజూ శాంసన్ 5 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్ విజయంతో ఐర్లాండ్ రెండు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, June 27, 2026, 17:42 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+