Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే ప్రపంచకప్ 2027‌లో భువనేశ్వర్ కుమార్ ఆడటంలో ఉన్న సమస్య ఇదే: ఆకాశ్ చోప్రా

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో టీమిండియా రాణించాలంటే అనుభవం కలిగిన బౌలర్లు అవసరమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2027 వన్డే ప్రపంచకప్‌కు పంత్, షమీ అవసరం లేదు.. కానీ ఆ 36 ఏళ్ల బౌలర్‌ను తీసుకోవాలి: అశ్విన్

2027 వన్డే ప్రపంచకప్‌కు పంత్, షమీ అవసరం లేదు.. కానీ ఆ 36 ఏళ్ల బౌలర్‌ను తీసుకోవాలి: అశ్విన్

వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన భువీ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు సీజన్లలో ఆర్‌సీబీ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని వన్డే ప్రపంచకప్‌కు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే సెలెక్టర్లు మాత్రం సీనియర్ పేసర్లను పట్టించుకోవడం లేదు.

Aakash Chopra Explains Why Bhuvneshwar Kumar s 2027 ODI World Cup Comeback Looks Difficult

వయసు కాదు.. అదే సమస్య..

తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. భువనేశ్వర్ కుమార్‌కు వయసు అడ్డంకి కాదని, వర్క్‌లోడ్ అతనికి అతిపెద్ద ప్రతికూలత అని చెప్పుకొచ్చాడు. 'భువనేశ్వర్ కుమార్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడాలని నేను కోరుకుంటున్నా. కానీ అతను రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీలు ఆడటం లేదు కాబట్టి అతనిపై అంతగా వర్క్ లోడ్ లేదు.

వన్డే క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు చాలా ఫిట్‌నెస్ కావాలి. అంతేకాకుండా నిరంతర శిక్షణ అవసరం. అతను నవంబర్ 2022 నుంచి భారత జట్టు తరఫున ఆడలేదు.

IPL 2027: ఆ SRH ఆటగాళ్లపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

Also Read

IPL 2027: ఆ SRH ఆటగాళ్లపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

వన్డే మ్యాచ్‌లు ఆడించాలి..

ఐపీఎల్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడనే ఏకైక కారణంతో నేరుగా 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేయడం సరికాదు. ఒకవేళ అతన్ని వన్డే ప్రపంచకప్ ‌జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఇప్పటి నుంచే ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడించాలి. వరుసగా అతనికి అవకాశాలు ఇవ్వాలి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్ కుమార్ గత రెండేళ్లుగా రంజీ ట్రోఫీ‌తో పాటు దేశీయ వన్డేలు ఆడలేదు. కేవలం టీ20 టోర్నీలు మాత్రమే ఆడాడు.

Story first published: Saturday, August 8, 2026, 17:45 [IST]
Other articles published on Aug 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+