Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే గుజరాత్ ఆటగాళ్లకు టీమిండియాలో చోటు: ఆకాశ్ చోప్రా

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వల్లే గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కుతుందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అయితే ఇది కొత్త కాదని, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ హయాంలోనూ ఈ విధానం కొనసాగిందని గుర్తు చేశాడు.

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌‌కు ఎంపిక చేసిన భారత జట్టులో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఏడుగురు ఆటగాళ్లు ఉండటం విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా టీమిండియా.. గుజరాత్ టైటాన్స్‌గా మారిపోయిందనే మీమ్స్ హల్‌ఛల్ చేశాయి.

శుభ్‌మన్ గిల్ వల్లే..

ఈ విమర్శలపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. 'సోషల్ మీడియాలో నేను కూడా చాలా మీమ్స్ చూశాను. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్‌కార్డులో కుల్దీప్ యాదవ్ ఏం చేస్తున్నాడని కొందరు, కగిసో రబాడను ఎందుకు పక్కన పెట్టారని మరికొందరు మీమ్స్ వేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టే గుజరాత్ ప్లేయర్లందరికీ భారత జట్టులో చోటు దక్కుతోందనే భావన అభిమానుల్లో ఎందుకు ఉందో నాకు అర్థమవుతోంది.

Aakash Chopra Dismisses Gujarat Titans Bias Claims Regarding Team India s Selections Under Captain Shubman Gill

అయితే, ఆ ప్లేయర్ల స్థానంలో మీరు ఎవరిని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోకుండా ఉండాల్సిందా? ఖచ్చితంగా అతడికి చోటు దక్కాలి. మానవ్ సుతార్ తన ఎంపిక సరైనదేనని ప్రదర్శనతో నిరూపించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవు. సాయి సుదర్శన్ అంతకుముందే జట్టులో భాగమయ్యాడు. ఈ కోణంలో చూస్తే.. గిల్ లేదా కెఎల్ రాహుల్ ఎవరు కెప్టెన్‌గా ఉన్నా ఈ ఆటగాళ్లకు ఎలాగైనా జట్టులో చోటు దక్కేది.

ధోనీ, కోహ్లీ, రోహిత్ కాలంలోనూ ఇంతే..

అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ధోనీ హయాంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు టీమిండియాలో అవకాశాలు దక్కేవి. కానీ వారంతా నిజమైన మ్యాచ్ విన్నర్లు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది.

ఒక ఆటగాడిని మనం నిరంతరం దగ్గరగా గమనించినప్పుడు.. అది కేవలం పక్షపాతం కాదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ ఆటగాడు ఎలా రాణిస్తున్నాడు. ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాడు అనేది ఆ కెప్టెన్‌కు బాగా తెలుస్తుంది. కళ్ల ముందే సుదీర్ఘ కాలంగా ఆడుతుండటం వల్ల వారి నైపుణ్యాలపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. అలా జరగడం సహజం.

పరిచయం నమ్మకాన్ని ఇస్తుంది..

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా మంది కేకేఆర్ ప్లేయర్లు టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం చూశాం. బాగా తెలిసిన ఆటగాళ్లను ఎవరైనా జట్టులోకి తీసుకుంటారు. ఇదంతా కేవలం నమ్మకానికి మాత్రం సంబంధించినదే. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదు.'అని ఆకాశ్ చోప్రా వివరణ ఇచ్చాడు.

Story first published: Thursday, June 11, 2026, 17:45 [IST]
Other articles published on Jun 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+