శుభ్‌మన్ గిల్ వల్లే యశస్వి జైస్వాల్‌కు అన్యాయం: ఆకాష్ చోప్రా
భారత టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. శుభ్‌మన్ గిల్ కారణంగానే అతనికి చోటు దక్కలేదని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. బ్యాకప్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసింది.
ఈ జట్టు ఎంపికపై గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. శుభ్‌మన్ గిల్ వల్లే యశస్వి జైస్వాల్‌కు అన్యాయం జరిగిందన్నాడు. 'యశస్వి జైస్వాల్ ఆడే విధానాన్ని పరిశీలిస్తే.. అతను జట్టులో మొదటి స్థానంలో ఉండాలి. ఎందుకంటే 2024 టీ20 ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్‌కే అవకాశం దక్కింది. కానీ తుది జట్టులో అవకాశం లేదు. రోహిత్ శర్మ కారణంగా అతనికి అవకాశం దక్కలేదు.

ఆ టోర్నీకి ముందే యశస్వి జైస్వాల్ టీ20ల్లో సెంచరీ చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆరుగురు భారతీయ ఆటగాళ్లలో అతను ఒకడు. కానీ ఆ తర్వాత టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. అందుకే జైస్వాల్‌ను టీ20లకు ఎంపిక చేయలేదు. అందుకే సెలెక్టర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను తాత్కలికంగా ఓపెనర్లుగా ఎంచుకున్నారు. వారిద్దరూ బాగా ఆడారు. దాంతో టీ20 టీమ్‌కు జైస్వాల్ దూరమయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చాడు. వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా దక్కాయి. అతను తిరిగిలేని శక్తిగా ఎదగడంతో సెలెక్టర్లు జైస్వాల్ వైపు చూడలేదు.
పేలవ ఫామ్‌తో గిల్ వేటుకు గురయ్యాడు. వాస్తవానికి అతని స్థానంలో జైస్వాల్ ఉండాలి. కానీ సంజూ శాంసన్‌కు బ్యాకప్ కోసం వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్‌ను తీసుకున్నారు. దాంతో యశస్వికి చోటు లేకుండా పోయింది. అప్‌కమింగ్ ఐపీఎల్ జైస్వాల్‌కు చాలా కీలకమైనది.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున ఇప్పటి వరకు 22 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 723 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 164 కాగా.. 67 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మొత్తం 216 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్‌రేట్ 152.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications