
పిచ్చి నిర్ణయం..
తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. రోహిత్ శర్మను ఓపెనర్‌గానే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. 'ఈ ప్రతిపాదన వస్తుందని ముందే ఊహించా. రోహిత్ శర్మను ఫినిషర్‌గా ఆడించాలని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి టీమిండియాకు సరైన ఫినిషర్ లేకపోవడం అయితే మరొకటి గత కొంతకాలంగా ఓపెనర్‌గా రోహిత్ ఇబ్బంది పడుతుండటం. అయితే రోహిత్ శర్మను ఫినిషర్‌గా ఆడించాలనే ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తా.

రోహిత్‌లాంటి ప్లేయర్ మరొకరు లేరు..
అతను రోహిత్ శర్మ.. ఆశమాషి ప్లేయర్ కాదు. భారత కెప్టెన్. ఓపెనర్‌గా ఎంతో అనుభవమున్న ఆటగాడు. ఒంటి చేత్తో 150, 200, 250 పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. నా అభిప్రాయం ప్రకారం వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడమే ఎంతో ముఖ్యం. ఎందుకుంటే రోహిత్ శర్మ వంటి ఓపెనింగ్ బ్యాటర్ జట్టులో మరొకరు లేరు. తనదైన రోజున రోహిత్ తన హిట్టింగ్‌తో మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేయగలడు.
ఈ ఆలోచనే సరైంది కాదు..
సునాయసంగా డబుల్ సెంచరీలు బాదగలడు. వన్డే క్రికెట్‌లో అతనికంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు మరొకరు లేరు. అలాంటి ప్లేయర్‌ను నెంబర్ 5, 6లో ఫినిషర్‌గా పంపిస్తే.. అత్యుత్తమ ఆటగాడిని దూరం చేసుకున్నట్లు అవుతోంది. రోహిత్ శర్మను మ్యాచ్ విన్నర్‌గా ఆడించాలనే ఆలోచనే సరైంది కాదనేది నా అభిప్రాయం.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే అభిమానులు మాత్రం ఆకాశ్ చోప్రా వివరణతో కన్విన్స్ అవ్వడం లేదు. ఇలా ఆలోచిస్తే రోహిత్ ఓపెనేరే అయ్యేవాడు కాదని గుర్తు చేస్తున్నారు.

ఇలా అనుకుంటే..
మిడిలార్డర్‌లో ఆడే రోహిత్ శర్మను ఓపెనర్‌గా ఆడిస్తే సూపర్ సక్సె సాధించాడని, ఇప్పుడు ఫినిషర్‌గా ఆడించినా ఇలాంటి రిజల్టే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జట్టులోకి రాలేదని, దాంతోనే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతుందని కామెంట్ చేస్తున్నారు. జట్టులో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నారని, కానీ ఫినిషర్ లేడని, రోహిత్ శర్మకు ఆ బాధ్యత అప్పగించాలని సూచిస్తున్నారు.
మరీ రోహిత్ శర్మను ఫినిషర్‌గా ఆడించాలనే ప్రతిపాదనపై మీ నిర్ణయం ఏంటో కామెంట్ చేయండి..?


Click it and Unblock the Notifications












