Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క ఫొటోలో కోహ్లీ జీవితం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్?

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అతని ఖాతాలను పరిశీలిస్తేనే అతని క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి అభిమానులున్నారు.

ఇప్పటికే చాలా మంది విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకున్నారు. మ్యాచ్‌ల సందర్భంగా ప్రత్యేక ప్లకార్డ్స్ ప్రదర్శించడం.. సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి పరుగెత్తి విరాట్ కాళ్లు మొక్కడం వంటి ఘటనలను ఎన్నో చూశాం.

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీకి కొందరు అభిమానులు ప్రత్యేకమైన బహుమతులు అందజేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వ్యాపారి కోహ్లీ కోసం వజ్రాలతో కూడిన బ్యాట్‌ను సిద్దం చేస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ ముందు ఈ బహుమతిని అందజేస్తానని ప్రకటించాడు.

Virat Kohli

1.05 క్యారట్ల ఒరిజినల్ డైమండ్‌తో తయారు చేస్తున్నట్లు ప్రకటించాడు. 15 మిల్లీ మీటర్ల పొడువున్న ఈ వజ్రాల బ్యాట్ ధర సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపాడు. తాజాగా మరో అభిమాని విరాట్ కోహ్లీ కోసం ఓ క్రేజీ ఆర్ట్ వర్క్‌ను సిద్దం చేశాడు. తన అసాధారణ ప్రతిభతో కోహ్లీ అభిమానులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు.

ఒక్క ఫొటోలో కోహ్లీ జీవితాన్ని చూపించాడు. డిజిటల్ ఆర్ట్ వర్క్ అయిన ఈ ఫొటోలో జూమ్ చేస్తున్నా కొద్ది కోహ్లీ జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలన్నీ వచ్చేలా డిజైన్ చేశాడు. ముందు భారత దేశ మ్యాప్‌తో కూడిన ఈ డిజిటల్ వర్క్‌లో ఢిల్లీ ప్రదేశాన్ని జూమ్ చేస్తే చిన్న నాటి కోహ్లీ వచ్చాడు. కోహ్లీ ఫొటోలోని కంటి భాగాన్ని జూమ్ చేస్తే అతని తండ్రితో దిగిన ఫొటో వచ్చింది.

కోహ్లీ తండ్రి కంటి భాగాన్ని జూమ్ చేస్తే.. అండర్ 19 ప్రపంచకప్ జెర్సీలో ఉన్న కోహ్లీ వచ్చాడు. ఆ ఫొటోను జూమ్ చేస్తే అండర్ 19 ప్రపంచకప్‌తో ఉన్న కోహ్లీ ఫొటో వచ్చింది. ఈ ఫొటోలోని అతని నోటి భాగాన్ని జూమ్ చేస్తే కోహ్లీ తొలి హాఫ్ సెంచరీ ఫోజ్ కనిపించింది. ఈ ఫొటోను జూమ్ చేస్తే ఫస్ట్ సెంచరీ ఫోజ్ వచ్చింది.

ఈ పిక్‌ను జూమ్ చేస్తే టెస్ట్ సెంచరీ ఫోజ్ కనిపించింది. ఈ ఫొటోను జూమ్ చేయగా.. కెప్టెన్ కోహ్లీ పిక్ వచ్చింది. ఆ తర్వాత టెస్ట్‌ పిక్ కనిపించింది. ఈ పిక్‌ను జూమ్ చేస్తే ఫిట్‌‌నెస్‌కు సంబంధించిన ఫొటో దర్శనమిచ్చింది. ఈ పిక్‌లోని టాటూని జూమ్ చేస్తే.. అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు వచ్చాయి.

చివరగా మూడేళ్ల తర్వాత కోహ్లీ అందుకున్న సెంచరీ ఫోజ్ వచ్చింది. 1.35 నిమిషాల పాటు ఉన్న ఈ ఫొటో ఫ్రేమ్ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. సదరు అభిమాని ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. 'ఒక్క ఫొటోలో కోహ్లీ జీవితం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్?’అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, August 20, 2023, 16:51 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+