హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కేవలం భారత్‌లోనే కాకుండా విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. శతృదేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.
క్రికెట్ ఆడే దేశాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కోహ్లీని అభిమానించే వారున్నారు. అతని ఫిట్‌నెస్‌తో పాటు బాలీవుడ్ హీరోను తలపించే లుక్‌కు పడిచచ్చే ఫాలోయింగ్ ఉంది. తాజాగా విరాట్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్ ఒకరు చేసిన పని నెటిజన్లు ఆకట్టుకుంటోంది. చేతితో అతను వేసిన కోహ్లీ పెయింటింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

నీ అభిమానానికి.. నీ టాలెంట్‌కు సలామ్ మామ అంటూ కామెంట్ చేస్తున్నారు. 'కొందరైతే విశ్వదాభిరామ ఈ కోహ్లీ అభిమాని వేరురా మామ!'అని కొనియాడుతున్నారు. ఈ పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుటు నెట్టింటిని షేక్ చేస్తోంది. ముఖ్యంగా కోహ్లీ అభిమానులను తెగ సంతోషపెడ్తోంది. కోహ్లీ ఫ్యాన్సే కాదు.. ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఆ అభిమానిని మనసారా అభినందిస్తూ సలామ్ చేస్తున్నారు. సదరు వ్యక్తి తెల్లని పేపర్‌పై రెడ్ కలర్ పెయింట్‌ను కుమ్మరించి మరీ కోహ్లీ పేయింట్ వేయడం గమనార్హం. చేతి వేళ్ల సాయంతోనే ఈ పెయింట్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. సతీమణి అనుష్క శర్మతో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉన్న కోహ్లీ.. ఈ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు. లండన్‌లోని నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ కుటుంబంతో గడుపుతున్నాడు. వచ్చె నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుండగా.. కోహ్లీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.