వన్డే మ్యాచ్‌లను రెండు ఇన్నింగ్స్‌లుగా ఆడిస్తే ఎలా ఉంటుంది?

హైదరాబాద్: కాలం గడుస్తున్నా కొద్దీ క్రికెట్ కూడా మారుతూ వచ్చింది. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 వ దశకంలో ధనాధన్ టీ20 ఫార్మాట్‌ను ప్రవేశ పెట్టగా.. అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆయా క్రికెట్ బోర్డులు ఫ్రాంచైజీ లీగ్స్‌కు తెరలేపడంతో టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీ20ల నుంచి టీ10, దిహండ్రెడ్ ఫార్మాట్‌లు కూడా పుట్టుకొచ్చాయి.
ఈ క్రమంలోనే లాంగెస్ట్ ఫార్మాట్‌లను అభిమానులు చూడలేకపోతున్నారు. అంత ఓపిక కూడా అభిమానులకు ఉండటం లేదు. దాంతోనే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) వన్డే ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీని కోరాడు. 50 ఓవర్ల ఫార్మాట్ బోర్ కొడుతోందని, మార్పులు చెయ్యడం అవసరమన్నాడు. ప్రత్యామ్నాయంగా యాభై బదులు నలభై ఓవర్లకు కుదిద్దామని ఐసీసీకి సూచించాడు.

40 ఓవర్లకు కుదిస్తే...?
అయితే సీనియర్ జరల్నిస్ట్ ప్రసేన్ బెల్లంకొండ మాత్రం 50 ఓవర్లను 40 ఓవర్లకు కుదించినా ప్రయోజనం ఉండదన్నారు. వన్డేలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇది గొప్ప పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త ఆలోచనను పంచుకున్నారు. వన్ డే, టెస్ట్, టీ 20 ఫార్మాట్‌లను కలిపి కొత్తా ఫార్మాట్‌ను తయారు చేయాలని కోరారు. రవి శాస్త్రి చెప్పినట్టు వన్డే ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించి.. టెస్ట్ ఫార్మాట్ తరహాలో రెండు ఇన్నింగ్స్‌లు ఆడించాలన్నారు.

టెస్ట్ తరహాలో వన్డేలు..
అప్పుడు ఒక వన్డే మ్యాచ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు చూడవచ్చని చెప్పారు. ప్రసేన్ చెప్పిన ఫార్మాట్ గురించి వివరంగా చెప్పుకుంటే.. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే 20 ఓవర్లు ఆడుతుంది. ఆ తర్వాత ఫీల్డింగ్ టీమ్ ఆడుతోంది. అనంతరం బ్యాటింగ్ టీమ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. ఫీల్డింగ్ టీమ్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యచేధనకు దిగుతోంది. ఉదహారణకు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసిందనుకోండి, రెండో జట్టు 145 పరుగులకే పరిమితమైతే.. అప్పుడు తొలి జట్టుకు 15 పరుగుల లీడ్ లభిస్తోంది.

ఒక వన్డే మ్యాచ్‌లో.. రెండు టీ20లు..
మళ్లీ మొదటి జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసి 130 పరుగులు చేసిందనుకోండి.. అప్పుడు రెండో జట్టు లక్ష్యం 146 అవుతోంది. అచ్చం టెస్ట్ తరహాలోనే ఇరు జట్లు రెండు ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇలా టీ20కి టెస్ట్ గుణాలను కలిపి వన్డేగా మార్చడం వల్ల ఆసక్తి పెరుగుతుందని, ఒక సారి విఫలమైన బ్యాటర్, బౌలర్‌కు రెండో అవకాశం దక్కుతోందనేది ప్రసేన్ ఆలోచన. ఇన్నింగ్స్ మారడం వల్ల అవసరమయ్యే అదనపు సమయం తగ్గించిన ఇరవై ఓవర్లతో బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఆలోచనను చాలా మంది అభిమానులు స్వాగతిస్తున్నారు. వన్డేలను ఇలా నిర్వహిస్తే ఆసక్తికరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications