క్రికెట్ బంతుల్లో మైక్రోచిప్‌లు.. బిగ్‌బాష్‌తో ప్రయోగం

మెల్‌బోర్న్: ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. దీంతో అంపైర్ల పాలిట వరంగా మారింది. అంపైర్ తప్పులు చేసినా.. వీటి ద్వారా సరైన సమాధానం లభిస్తోంది. ఇప్పటికే ఉన్న డీఆర్‌ఎస్, హాక్ ఐ, స్నికోమీటర్, హాట్ స్పాట్ వంటి టెక్నాలజీలతో బ్యాట్స్‌మన్ ఔటా కాదా అన్నది కచ్చితంగా నిర్ధారణ అవుతోంది. ఇటీవలే ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను ప్రకటించే అధికారాన్ని థర్డ్ అంపైర్లకు ఇవ్వాలని ఐసీసీ ప్రయోగం చేస్తోంది. ఇలా నూతన టెక్నాలజీలు ఎన్నో వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా మైక్రో చిప్‌లతో కూడిన బంతులు కూడా రానున్నాయి.
ఆసీస్, న్యూజిలాండ్‌లో ఈ బంతులే:
అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ మైక్రో చిప్‌లతో (స్మార్ట్ బంతి) కూడిన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తుంది. ఆసీస్, న్యూజిలాండ్‌లలో ఈ బంతులనే ఉపయోగిస్తారు. వచ్చే వేసవిలో జరిగే ఆసీస్ టీ20 లీగ్ బిగ్‌బాష్‌లో ఈ బంతులను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్మార్ట్ బంతిని రకరకాలుగా పరీక్షించింది. బిగ్‌బాష్‌లో ప్రయోగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోనుంది.

డీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర:
ఈ స్మార్ట్ బంతులు వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకాబుర్ర ప్రకటించింది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్ అవుతోంది?. గాలిని బట్టి ఎంత వేగంతో బంతిని విసరాలి, బంతిని ఎక్కడ విసిరితే ఎలా టర్న్ అవుతుంది? వంటి వివరాల్ని కూడా తెలుపుతుందట. అంతేకాదు నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్), క్యాచ్‌ల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ స్మార్ట్‌బాల్స్ కూకబుర్రా బంతుల్లాగే ఉంటాయట.

బీబీఎల్‌లో ప్రయోగం:
ముఖ్యంగా ఈ బంతులతో అంపైర్లు, ఆటగాళ్ల మధ్య అభిప్రాయబేధాలు రాకుండా ఉంటాయని కూకబుర్రా సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్ అనే సంస్థ కూడా పనిచేస్తోంది. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైకేల్ కస్ప్రోవిచ్ కూకాబుర్రకు ఛైర్మన్. బీబీఎల్‌లో ప్రయోగించనున్న నేపథ్యంలో ఈ బంతి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో, ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!!