టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
193 పరుగుల లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియాకు టాపార్డర్, మిడిలార్డ్ హ్యాండ్ ఇచ్చారు. నాలుగో రోజు ఆటలోనే యశస్వి జైస్వాల్(0), కరుణ్ నాయర్(14), శుభ్‌మన్ గిల్(6), ఆకాశ్ దీప్(1) ఔటయ్యారు. 58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాటింగ్ తడబాటు కొనసాగింది. తొలి సెషన్‌లోనే రిషభ్ పంత్(9), కేఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(0), నితీష్ కుమార్(13) ఔటయ్యారు. రాహుల్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా.. నితీష్‌తో పాటు 8వ వికెట్‌కు 30 పరుగులు .. బుమ్రాతో కలిసి 9వ వికెట్‌కు 35 పరుగులు జోడించాడు.

ఆ తర్వాత సిరాజ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో జడేజా 150 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసిన జడేజా తన లాంగ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, సిక్స్ మాత్రమే కొట్టాడు. 1932లో లార్డ్స్ మైదానంలో వినూ మన్కడ్ రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయగా.. తాజా జడేజా ఈ ఫీట్ సాధించాడు.
జడేజా పోరాడినా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 193 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కేఎల్ రాహుల్(39) పర్వాలేదనిపించాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు.
జోఫ్రా ఆర్చర్(3/55), బెన్ స్టోక్స్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్, క్రిస్ వోక్స్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.