For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1983 ప్రపంచకప్ విజయం.. భారత క్రికెట్‌లో విప్లవం! ఆటగాళ్లకు బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి..

 83 Movie: How India Won 1983 World Cup Under Kapil Devs Captaincy With Those Emotional Moments

హైదరాబాద్: భారత క్రికట్‌ ప్రస్థానంలో అతనో సంచలనం. అతని కెప్టెన్సీ ఓ చరిత్ర. అతని ఆల్‌రౌండ్‌ ప్రదర్శన అమోఘం.! ఒక్కమాటలో చెప్పాలంటే.. '1983 ప్రపంచకప్‌ భారత్‌ గెలిచింది' అనేకన్నా 'కపిల్‌దేవ్‌ గెలిపించాడు' అనడంలో ఎలాంటి సందేహం లేదు.! విండీస్‌తో జరిగిన నాటి ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ దేవ్ అందుకున్న తీరును నాటి క్రికెట్ అభిమానులు ఇప్పటికి మర్చిపోలేరు.! ఈ విజయంతో భారత క్రికెట్ చరిత్ర మలుపు తిరిగింది.

ఆటగాళ్లకు కనీసం బూట్లు కూడా కొనివ్వలేని దయనీయ స్థితిలో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. నేడు యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తోందన్నా.. మనదేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారిందన్నా.. దానికి కారణం ఈ 1983 ప్రపంచకప్ విజయమే.! ఈ విజయం ఆధారంగా నిర్మించిన 83 చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందు రానున్న నేపథ్యంలో నాటి విజయ క్షణాలను ఒకసారి నెమరువేసుకుందాం.!

అంచానల్లేకుండా..

అంచానల్లేకుండా..

కపిల్ దేవ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన భారత జట్టు 1983 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అప్పుడు భారత్ టైటిల్ గెలవడం దేవుడెరుగు.. కనీసం లీగ్ దశ దాటితే చాలాని అంతా భావించారు. జట్టులో సునీల్‌ గవాస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, మదన్‌లాల్‌, రవిశాస్త్రి, సందీప్‌పాటిల్‌, రోజర్ బిన్నీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయినా ఈ దిగ్గజాలపై ఎవరికీ అంచనాల్లేవు. మొత్తం ఎనిమిది జట్లు.. ఆ ప్రపంచకప్‌లో పాల్గొనగా రెండు గ్రూపులుగా నాలుగేసి జట్లను విభజించారు. భారత్‌ ఉన్న విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు మరో పెద్ద జట్టు ఆస్ట్రేలియా, జింబాబ్వే ఉన్నాయి.

కపిల్ 175 నాటౌట్..

కపిల్ 175 నాటౌట్..

వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపొంది ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్.. అనంతరం రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను 155 పరుగులకే కట్టడి చేసి రెండో విజయం సొంతం చేసుకుంది. తర్వాత ఆసీస్‌, వెస్టిండీస్‌లతో వరుసగా ఓటమిపాలవడం వల్ల కపిల్​సేనకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌ బెర్తు. అలాంటి పరిస్థితుల్లో కపిల్ దేవ్(175 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో జింబాబ్వేపై చిరస్మరణీయ విజయాన్నందించాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌ టీవీల్లో ప్రసారం కాలేదు. ఆ రోజు బీబీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల యావత్‌ క్రీడాలోకం కపిల్‌దేవ్‌ చారిత్రక ఇన్నింగ్స్‌ను చూడలేకపోయింది.

43 పరుగుల తేడాతో..

43 పరుగుల తేడాతో..

తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన కపిల్‌సేన.. తొలిసారి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. అక్కడ పటిష్ఠమైనత ఇంగ్లాండ్‌ను ఓడించి సరాసరి ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను 43 పరుగులతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మెగా ఫైనల్లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కపిల్‌ సేన 183 పరుగులకే కుప్పకూలింది.

గార్డన్‌ గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌ హెయిన్స్‌, వివ్‌ రిచర్డ్స్‌, క్లైవ్‌ లాయిడ్‌ లాంటి ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌ కలిగిన వెస్టిండీస్‌ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ భారత బౌలర్లు చెలరేగడంతో ఆరంభంలోనే గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌, రిచర్డ్స్‌ త్వరగా ఔట్‌ కావడం భారత్‌కు కలిసివచ్చింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయడం వల్ల ఆ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది.

20 మీటర్లు పరుగెత్తి..

20 మీటర్లు పరుగెత్తి..

కపిల్ కమాల్ క్యాచ్‌తో భారత్ ఈ విజయాన్నందుకుంది. మదన్‌లాల్‌ వేసిన బంతిని వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ భారీషాట్‌ ఆడడం వల్ల బంతి గాల్లోకి లేచింది. అదే సమయంలో కపిల్‌దేవ్‌ ఏకంగా 20 మీటర్లు పరుగెత్తి కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఒకవేళ ఇది గనక పట్టి ఉండకపోతే రిచర్డ్స్ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేవాడు.

ఏదేమైనా ఈ ప్రపంచకప్‌తో కపిల్‌దేవ్‌ హీరో కావడమే కాకుండా ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. తాజాగా నిర్మించిన '83' చిత్రంలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. ఈ టోర్నీ సెమీ ఫైనల్‌, ఫైనల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమర్‌నాథ్ పాత్రను షకీబ్ సలీమ్ పోషించాడు.

Story first published: Wednesday, December 22, 2021, 15:13 [IST]
Other articles published on Dec 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+