Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ ద్రవిడా మజాకా.. గత13 ఏళ్లల్లో ఏడుగురు కెప్టెన్లు మారితే.. ఈ ఏడాదిలోనే 8 మంది కెప్టెన్లు!

8 Indian Captains Got Changed After Rahul Dravid Became Indian Head Coach

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. కరోనా వైరస్ నుంచి అతను కోలుకోకపోవడంతో టెస్ట్ వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. ఈ మ్యాచ్‌కు వైస్‌ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారు. బుమ్రాను సారథిగా నియమించడంతో గతేడాది కాలంలో టీమిండియా కెప్టెన్ల సంఖ్య 8కి చేరింది. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అతను వస్తూనే విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశాడు.

ఏడాదిలో 8 మంది కెప్టెన్లు..

ఏడాదిలో 8 మంది కెప్టెన్లు..

దాంతో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. అయితే అతని ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో కొన్ని సిరీస్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇతర ఆటగాళ్లు జట్టును నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం వంటి పరిస్థితులు కూడా కెప్టెన్ల మార్పునకు కారణమైంది. గత 12 నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలతో పాటు తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా వరకు మొత్తం 8 మంది జట్టుకు సారథ్యం వహించడం విశేషం.

13 ఏళ్లలో ఏడుగురు కెప్టెన్లే..

2008 నుంచి 2021 వరకు 13 ఏళ్ల కాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఏడుగురు కెప్టెన్లు మాత్రమే మారారు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర్నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించాడు. దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. విశ్రాంతి పేరిట దూరమైన సిరీస్‌లకు అతని డిప్యూటీలు సెహ్వాగ్, గంభీర్, విరాట్ కోహ్లీలు జట్టును నడిపించారు. ఇక విరాట్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. కానీ విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ద్వితీయ శ్రేణి జట్లతో..

ద్వితీయ శ్రేణి జట్లతో..

ఒకే సమయంలో రెండు సిరీస్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపడం కూడా కెప్టెన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. శ్రీలంక పర్యటనలో ప్రయోగాత్మకంగా బీసీసీఐ.. ధావన్ సారథ్యంలోని యువ జట్టును పంపించి సక్సెస్ సాధించింది. దాంతో ఈ ఏడాది ఐర్లాండ్ పర్యటనకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసి యువ జట్టును పంపించింది. ఇక రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యలు, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గైర్హాజరీ కూడా కెప్టెన్ల మార్పునకు కారణమైంది. సౌతాఫ్రికాతో సిరీస్‌కు చివరి నిమిషంలో కేఎల్ రాహుల్ దూరమవడంతో పంత్ జట్టును నడిపించాడు.

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
కోహ్లీని తప్పించడంతోనే..

కోహ్లీని తప్పించడంతోనే..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే టీమ్‌లో శిఖర్ ధావన్‌కు చోటు ఇవ్వకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఫిట్‌నెస్‌కి మారుపేరైన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Thursday, June 30, 2022, 20:20 [IST]
Other articles published on Jun 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+