Sydney Test: పుజారా హాఫ్ సెంచరీ.. టెస్టుల్లో అరుదైన మైలురాయి!!

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్, నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (52; 172 బంతుల్లో 7x4) అర్ధ శతకం సాదించాడు. స్పిన్నర్ నాథన్ లైయాన్ వేసిన 76వ ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాదిన పుజారా.. హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 170 బంతుల్లో నయావాల్ హాఫ్ సెంచరీ చేశాడు. కీలక సమయంలో విలువైన పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా పుజారా (50: 176 బంతుల్లో 5x4) అర్ధ శతకం చేసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో కాస్త తడబడ్డా.. సిడ్నీ టెస్టులో లయ అందుకున్నాడు.

టెస్టుల్లో 6 వేల పరుగులు:
సిడ్నీ టెస్టులో ఛెతేశ్వర్ పుజారా ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి దాటాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 73వ ఓవర్‌లో సింగిల్ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగులను పూర్తిచేశాడు. కాసేపటికే నాథన్ లైయన్ వేసిన 76వ ఓవర్‌లో బౌండరీ బాది ఈ మ్యాచ్‌లో రెండో అర్ధశతకం సాధించాడు. ఇప్పటివరకు పుజారా మొత్తం 80 మ్యాచ్‌ల్లో 134 ఇన్నింగ్స్‌లు ఆడి 26 అర్ధ శతకాలు, 18 శతకాలు చేశాడు. 2012లో ఇంగ్లాండ్‌పై ఓ టెస్టులో 206 అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. 6 వేల టెస్ట్ పరుగులు సాదించిన 11వ భారత ఆటగాడిగా నిలిచాడు.

అత్యధిక నాలుగో వికెట్ భాగస్వామ్యం:
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (97; 118 బంతుల్లో 12x4, 3x6) తృటిలో శతకం కోల్పోయాడు. పుజారా (58 నాటౌట్; 181 బంతుల్లో 9x4)తో కలిసి నాలుగో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు. ఇది రెండవ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు అత్యధిక నాలుగో వికెట్ భాగస్వామ్యం. 1948-49లో రూసీ మోడీ-విజయ్ హజారే 139 పరుగులు చేశారు. దిలీప్ వెంగ్‌సర్కర్-యశ్‌పాల్ శర్మ 1979-80లో 122 రన్స్ చేశారు.

పుజారా ఆధిపత్యం:
ఐదో రోజు భోజన విరామం తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లపై పంత్, పుజారా ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే లైయన్ వేసిన 80వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయి.. గల్లీ పాయింట్‌లో పాట్ కమిన్స్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 250 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. పంత్ అనంతరం తెలుగు క్రికెటర్ హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. అతడు ఇంకా ఖాతా తెరవలేదు. అయితే పుజారా మాత్రం కమిన్స్ వేసిన 83వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. భారత్ 85 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. పుజారా (71), విహారి (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 143 పరుగులు చేయాలి.

Pujara milestones (innings):
1000: 18
2000: 46
3000: 67
4000: 84
5000: 108
6000: 134
చేటేశ్వర్ పుజారానే టార్గెట్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌కు జరిమానా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications