SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ఐదు కారణాలు ఇవే!

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ పరాజయాల పరంపరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీకి తోడుగా యశస్వీ జైస్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36), మహిపాల్ లోమ్‌రోర్(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరగులు చేసింది. జాసన్ రాయ్(42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 60), కెప్టెన్ కేన్ విలియమ్సన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్, మహిపాల్ లోమ్రార్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.

జాసన్ రాయ్ రాక..
జాసన్ రాయ్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతనే మారింది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాసన్ రాయ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. బౌలర్లతో సంబందం లేకుండా ధాటిగా ఆడాడు. అతని చేరికతో టీమ్‌కు మంచి బ్యాలెన్స్ వచ్చింది. ఫీల్డింగ్‌లోను జాసన్ రాయ్ అదరగొట్టాడు. కీలక ఆటగాళ్ల క్యాచ్‌లు అందుకున్నాడు. ఆరంభంలోనే జాసన్‌కు అవకాశం ఇచ్చినా సరిపోయేది కదా? అని అందరూ అనుకునేలా ఆడాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జాసన్ రాయ్.. హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సూపర్ బౌలింగ్..
టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో అండగా నిలిచారు. ఆరంభంలోనే లూయిస్ ను పెవిలియన్ చేర్చి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత క్రీజులో కుదురుకుంటున్న జైస్వాల్‌ను పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత సంజూ శాంసన్ చెలరేగినా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో కట్టడి చేసి రాజస్థాన్‌ను సాధారణ స్కోర్‌కే పరిమితం చేశారు. తొలి మూడు ఓవర్లు దారుళంగా పరుగులిచ్చుకున్న సిద్దార్థ్ కౌల్ చివరి ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

కేన్ మామ సూపర్ కెప్టెన్సీ
ఈ మ్యాచ్‌లో కేన్ మామ తనదైన సారథ్యంతో అదరగొట్టాడు. ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో విలియమ్సన్ కెప్టెన్సీ స్పాటాన్‌గా నిలిచింది. ముఖ్యంగా రాజస్తాన్ భారీ స్కోర్ చేయకుండా తనదైన వ్యూహాలను రచించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. చివరి వరకు క్రీజులో నిలబడి అద్భుత విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

ఓపెనర్ల శుభారంభం
భారీ లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు వృద్దీమాన్ సాహా, జాసన్ రాయ్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జాసన్ రాయ్.. ఉనాద్కత్ వేసిన మూడో ఓవర్‌లో భారీ సిక్సర్‌తో తన బౌండరీల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన రాయ్.. మోరీస్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు ఫోర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. ఫస్ట్ వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇది కేన్ మామాపై ఒత్తిడి లేకుండా చేసింది. దాంత అతను స్వేచ్చగా ఆడి విజయాన్నందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications