Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK:ఈ ఐదు కారణాల వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమిండియా!

5 Reasons Why India losing against Pakistan In Asia Cup 2022 Super 4 Match

హైదరాబాద్: ఆసియాకప్‌ 2022లో టీమిండియా‌కు తొలి ఓటమి ఎదురైంది. లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్ గెలిచి సూపర్ 4 చేరిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్నది. ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమికి కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుంది టీమిండియా పరిస్థితి.

టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి అర్షదీప్ సింగ్ కీలక క్యాచ్ నేలపాలు చేసేవరకు అనేక మలుపులు తిరుగుతూ ఇరు జట్ల అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్ చివరకు పాకిస్థాన్ వశమైంది. ముఖ్యంగా సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు ఘోర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

టాస్ ఓడిపోవడం..

టాస్ ఓడిపోవడం..

భారత్ టాస్ గెలవకపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్‌కు ప్రాముఖ్యత ఇవ్వమని ఇరు జట్ల కెప్టెన్లు ప్రగల్భాలు పలికినా.. ముందుగా బౌలింగ్ చేయడం అడ్వాంటేజ్‌గా మారింది. పిచ్ బ్యాటింగ్‌ను అనుకూలంగా ఉన్నా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఈజీ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. డ్యూ కూడా రావడం, తీవ్ర ఉక్కపోతతో ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. మైదాన పరిస్థితులు ఫీల్డింగ్‌పై ప్రభావం చూపాయి. సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో చేజింగ్ అనుకూలంగా ఉంటుంది. పాక్‌తో గత మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే.

మిడిలార్డర్ వైఫల్యం..

మిడిలార్డర్ వైఫల్యం..

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ధనాధన్ బ్యాటింగ్‌తో అందించిన శుభారంభాన్ని మిడిలార్డర్ బ్యాటర్లు అందిపుచ్చుకోలేకపోయారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా దారుణంగా విఫలమవడంతో జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. రోహిత్,రాహుల్ దూకుడుతో భారత్ 200 పరుగులైనా చేస్తుందని అంతా భావించారు. కానీ ధాటిగా ఆడాలనే క్రమంలో సూర్య, దీపక్ హుడా ఔటవ్వగా.. చెత్త షాట్లతో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా వెనుదిరిగారు. ఈ ఇద్దరి వైఫల్యం టీమ్ విజయవకాశాలపై ప్రభావం చూపింది.

కార్తీక్ లేని లోటు..

కార్తీక్ లేని లోటు..

రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగాల్సి వచ్చింది. లెఫ్టాండ్ బ్యాటర్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తీక్‌ను కాదని రిషభ్ పంత్‌ను తీసుకొచ్చింది. అతను మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు. అదే దినేశ్ కార్తీక్ జట్టులో ఉండి ఉంటే విరాట్ కోహ్లీతో కలిసి కీలక పరుగులు చేసేవాడు. కనీసం మరో 20-30 పరుగులు రాబట్టేవాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ విలువ ఏంటో తెలుసొచ్చింది.

పేలవ బౌలింగ్, ఫీల్డింగ్..

పేలవ బౌలింగ్, ఫీల్డింగ్..

టీ20ల్లో 182 పరుగుల లక్ష్యం కాపాడుకోగలిగనదే. కానీ భారత బౌలర్లు ఆ పని చేయలేకపోయారు. ఆరంభంలోనే రెండు వికెట్లు తీసినా ఆ జోరును కొనసాగించలేకపోయారు. మహమ్మద్ నవాజ్‌ను అప్‌ది ఆర్డర్‌ పంపిస్తూ పాక్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. అతను రిజ్వాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

ఈ ఇన్నింగ్స్ పాకిస్థాన్‌ విజయానికి బాటలు వేసింది. ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. చివరకు భువనేశ్వర్ కుమార్ ఈ జోడీని విడదీసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా అసిఫ్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అర్షదీప్ సింగ్ వదిలేయడం భారత్ కొంపముంచింది. అతనే 16 పరుగులు చేసి పాక్ విజయ‌లాంఛనాన్ని పూర్తి చేశాడు.

హార్దిక్ పాండ్యా వైఫల్యం..

హార్దిక్ పాండ్యా వైఫల్యం..

పాక్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో డకౌట్ అయిన అతను.. బౌలింగ్‌లోనూ అదే చెత్త ప్రదర్శన కొనసాగించాడు. 4 ఓవర్లు వేసి 44 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ రెండు ఓవర్లు కట్టుదిట్టంగా చేసినా.. బ్యాటింగ్‌లో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

Story first published: Monday, September 5, 2022, 7:13 [IST]
Other articles published on Sep 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+