India vs Australia: ఈ ఐదు తప్పిదాల వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమిండియా!

మొహాలీ: టీ20 ప్రపంచకప్ ముందు ఫైనల్ రౌండ్ ప్రిపరేషన్స్‌గా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో టీమిండియాకు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన తొలి టీ20లో పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆరోన్ ఫించ్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బ్యాటర్లు అదరగొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అనేక తప్పిదాలు జరిగాయి. మరోసారి డెత్ ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేసారు. ముఖ్యంగా టీమిండియా చేసిన ఐదు తప్పిదాలు జట్టు పతనాన్ని శాసించాయి.

క్యాచ్‌లు నేలపాలు చేయడం..
'క్యాచెస్ విన్ మ్యాచెస్'అనే నానుడి క్రికెట్‌లో చాలా పాపులర్. ఇది టీమిండియాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా మూడు క్యాచ్‌లు నేలపాలు చేశారు. అవి కూడా కీలక ఆటగాళ్లు ఇచ్చిన సునాయస క్యాచ్‌లనే. ముఖ్యంగా ఆసీస్ జట్టులో భారీ ఇన్నింగ్స్ ఆడిన కామెరూన్ గ్రీన్ ఆరంభంలో ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు.
ఆ క్యాచ్ పట్టుంటే గ్రీన్ 42 పరుగులకే వెనుదిరిగేవాడు. ఆ వెంటనే లాంగాఫ్‌లో స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ విడిచి పెట్టాడు. ఇక కీలక 18వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హర్షల్ పటేల్ అందుకోలేకపోయాడు. ఆ క్యాచ్ పట్టినా ఫలితం మరోలా ఉండేది. ఈ అవకాశాన్ని అందుకున్న అతను.. రెండు సిక్స్‌లు, 4 ఫోర్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఎల్‌బీ డబ్ల్యూ అప్పీల్ చేయకుండా..
ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ బౌలర్, కీపర్‌తో పాటు మరే ప్లేయర్ అప్పీల్ చేయలేదు. రోహిత్ శర్మ సైతం రివ్యూ తీసుకోలేదు. కానీ రిప్లేలో ఔటైనట్లు తేలింది. దాంతో భారత ఆటగాళ్లు చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నారు. ఆ క్షణాన రివ్యూ తీసుకున్నా.. అప్పీల్ చేసినా భారత్‌కు కలిసొచ్చేంది. ఎందుకంటే అప్పటికీ అతను 26 పరుగులు మాత్రమే చేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 60 పరుగులతో విజయంలో కీలకమయ్యాడు.

ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవడం...
టీ20 ప్రపంచకప్ జట్టులో లేని ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవడం టీమిండియా వైఫల్యానికి కారణమైంది. రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను 27 పరుగులిచ్చాడు. ఇందులో 8 బంతుల్లోనే 26 పరుగులు సమర్పించుకున్నాడు. రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ రివ్యూ పుణ్యాన స్మిత్, మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేశాడు. అయితే అతని పేలవ బౌలింగ్.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఆప్షన్ లేకుండా చేసింది.
అతన్ని రెండు ఓవర్లకే పరిమితం చేసిన రోహిత్.. భువీ, హర్షల్‌పై ఆధారపడి మూల్యం చెల్లించుకున్నాడు. ఉమేశ్ యాదవ్‌కు బదులు దీపక్ చాహర్‌ను తీసుకున్నా.. ఫలితం మరోలా ఉండేది. ఉమేశ్ యాదవ్ కట్టడిగా బౌలింగ్ చేసినా జట్టుకు కలిసొచ్చేది.

పేలవ డెత్ బౌలింగ్..
డెత్ ఓవర్లలో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. వికెట్లు తీయకపోవడమే కాకుండా ధారళంగా పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమమయ్యారు. ముఖ్యంగా 17, 18, 19 ఓవర్లలో 15, 22, 16 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మూడు ఓవర్లలో ఏ ఒక్కటి కట్టిడి చేసినా టీమిండియాకు విజయం దక్కేది. ముఖ్యంగా హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ ఓవర్‌లోనే వేడ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దాంతో చెలరేగిన అతను 22 పరుగులు పిండుకున్నాడు.

భువీ, చాహల్ వైఫల్యం..
భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఆసియా కప్‌లో ఆఖరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చి విమర్శల పాలైన భువీ తన ఆటను ఏ మాత్రం మార్చుకోలేకపోయాడు. 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ చాహల్ సైతం ఏం ప్రభావం చూపలేకపోయాడు. ఆసియాకప్ వైఫల్యాన్ని కొనసాగించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాడు. 3.2 ఓవర్లలో వికెట్ తీసి 42 పరుగులు ఇచ్చుకున్నాడు. చాహల్ వికెట్లు తీసినా.. భువీ కట్టడిగా బౌలింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications