IPL 2021 Winner: ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలుస్తుందనడానికి ఐదు కారణాలివే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. అసలు సిసలు క్లైమాక్స్ పోరుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే టాప్-3 టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖారారు చేసుకున్నాయి. నాలుగో ప్లేస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. నాలుగో టీమ్‌గా ప్లే ఆఫ్స్ చేరడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇక సోమవారం పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీకి బలమైన బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉంది.
అంతేకాకుండా రికీ పాంటింగ్ రూపంలో అద్బుత కోచ్ ఉన్నాడు. ఈ సూపర్ కాంబినేషన్‌తో గత రెండేళ్లుగా మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ.. ఈ సీజన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ అద్భుత విజయాలందుకుంది. గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ ఈ సారి టైటిల్ గెలుచుకునేలా కనిపిస్తోంది. ఢిల్లీనే చాంపియన్‌గా నిలుస్తుందనడానికి ఉన్న ఓ ఐదు బలమైన కారణాలపై ఓ లుక్కెద్దాం.

పటిష్టమైన బౌలింగ్ లైనప్, పేస్ త్రయం..
ఢిల్లీ క్యాపిటల్స్ సగం బలం బౌలింగ్ లైనప్. కగిసో రబడా, అన్రిచో నోర్జ్, అవేశ్ ఖాన్ పేస్ త్రయానికి రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ ద్వయం తోడవ్వడంతో ఢిల్లీకి తిరుగు లేకుండా పోయింది. ముఖ్యంగా అవేశ్ ఖాన్ చేరిక ఆ జట్టు బలాన్ని మరింత పెంచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన అవేశ్ ఖాన్ 22 వికెట్లు తీశాడు. వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.
కీలక సమయంలో పంత్ నమ్మకాన్ని నిలబెడుతూ బ్రేక్ త్రూ అందిస్తున్నాడు. గతేడాది ఇదే యూఏఈ గడ్డపై దుమ్మురేపిన రబడా.. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో మెప్పించకపోయినా సెకండాఫ్‌లో దుమ్మురేపుతున్నాడు. మరోవైపు నోర్జ్ తన వేగవంతమైన పేస్‌తో ఇబ్బంది పెడుతూ వికెట్లు తీస్తున్నాడు. మొత్తానికి ఈ పేస్ త్రయం నిలకగా రాణిస్తూ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ముగ్గురు ఇదే ఫామ్‌ను నాకౌట్ మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే ఢిల్లీకి తిరుగుండదు. ఇక స్పిన్ బౌలర్ అశ్విన్ పరుగులిస్తున్నప్పటికీ వికెట్లు తీస్తున్నాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.

శిఖర్ ధావన్.. భీకర బ్యాటింగ్ లైనప్..
ఇక బౌలింగ్‌తో పాటు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 500కు పైగా పరుగులు బాదిన ధావన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. భారత్ వేదికగా చూపించిన జోరునే యూఏఈ గడ్డపై కూడా రిపీట్ చేస్తున్నాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా సెకండాఫ్‌లో విఫలమైనప్పటికీ.. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చాడు.
ఫస్టాఫ్‌లో ఢిల్లీ విజయాల్లో ఈ ఇద్దరే కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హెట్‌మైర్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా ఉంది. లోయరార్డర్‌లో అశ్విన్, అక్షర్ పటేల్‌కు కూడా బ్యాటింగ్ చేయగలరు. నాకౌట్ మ్యాచ్‌ల్లో వీరిలో ఏ ముగ్గురు రాణించినా ఢిల్లీ భారీ స్కోర్ చేయడం ఖాయం.

రిషభ్ పంత్ సూపర్ కెప్టెన్సీ..
శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో సారథ్య బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్.. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. మైదానంలో అనుసరించే వ్యూహాల విషయంలో చురుకుగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పంత్ సారథ్యం మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తుంది.
వికెట్ల వెనుకాల బ్యాట్స్‌మన్ కదలికలను గమనిస్తూ.. అప్పటికప్పుడు బౌలర్లతో వ్యూహాలు రచించి వికెట్లు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అవేశ్ ఖాన్ రాణించడానికి వికెట్ల వెనుకాల పంత్‌ది కీలక పాత్ర. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌తో కలిసి మోర్గాన్‌ను ఇలానే బోల్తా కొట్టించాడు. డీఆర్‌ఎస్ విషయంలోను కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా కెప్టెన్ పంత్ ఇదే జోరు కొనసాగిస్తే ఢిల్లీకి తిరుగుండదు.

రికీ పాంటింగ్..
ఢిల్లీ విజయాల్లో ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ది కీలక పాత్ర. 2018లో టీమ్ బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. జట్టును పూర్తిగా మార్చేశాడు. ఆ సీజన్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ 2019లో కోచ్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఆ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ గతేడాది రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి టైటిలే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న రికీ పాంటింగ్.. టీమ్ అద్భుతంగా రాణించడంలో కీలక వ్యూహాలు రచిస్తున్నాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల నైపుణ్యానికి సానా పడుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా గొప్ప రికార్డు ఉన్న పాంటింగ్.. ఈ సారి టైటిలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.

సమష్టి ప్రదర్శన..
ఢిల్లీ విజయాలకు మరో కారణం సమష్టిగా రాణించడం. ఇతర జట్లలా ఏ ఒక్కరిపైనో ఆధారపడకపోవడం. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని ఆడటం ఆ జట్టును ఈ స్థాయికి చేర్చింది. శిఖర్ ధావన్, పృథ్వీ షా విఫలమైనప్పుడు.. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బాధ్యత తీసుకొని ఆడటం.. చివర్లో హెట్‌మైర్ మెరుపులు మెరిపించడం జట్టును అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇదే ప్రదర్శనను నాకౌట్ మ్యాచ్‌ల్లో పునరావృతం చేస్తే ఢిల్లీ టైటిల్ గెలవడం ఖాయం. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమవ్వడం జట్టుకు దెబ్బే. అతను కూడా ఉంటే టీమ్ ఇంకా బలంగా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications