For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: కివీస్‌లోని ఆ ఐదుగురితో టీమిండియాకు డేంజరే.. కట్టడి చేయకుంటే ఖతమే!

5 Problems Team India Will Face Ahead Of WTC Final against New Zealand
Virat Kohli & Co. Needs To Be Careful With These 5 Players

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. వచ్చే శుక్రవారమే(జూన్18) ఈ మెగాపోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌ను 1-0తో మట్టికరిపించి రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్‌ ఉండగా.. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు.. కివీస్‌ మాత్రం కొరకరాని కొయ్యలా మారింది. గత 18 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో తలపడిన ప్రతీసారి భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను కోహ్లీసేన గెలవాలంటే.. ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిందే. లేదంటే 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ ఫలితం పునరావృతమవడం ఖాయం. ముఖ్యంగా ప్రతర్థి జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల జోరుకు అడ్డుకట్ట వేయాల్సిందే. లేకుంటే గత రెండేళ్లుగా పడ్డ కష్టం బుగ్గిపాలవుతోంది. ఇంతకీ ఆ డేంజరెస్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం.!

 బౌల్ట్‌ను అడ్డుకోవడం బ్యాట్ మీద సామే!

బౌల్ట్‌ను అడ్డుకోవడం బ్యాట్ మీద సామే!

న్యూజిలాండ్‌ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌‌‌కు తగినట్లు ప్రణాళికలు రచించకపోతే టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంటుంది. సహకారం లభించే పిచ్‌పై అతను దుమ్మురేపుతాడు. ఇన్‌స్వింగర్లు వేయడం బౌల్ట్‌ ప్రత్యేకత. ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో టీమిండియా టాప్‌ఆర్డర్‌ బలహీనతను అతడు సొమ్ము చేసుకోగలడు. అందుకే బౌల్ట్‌ను ఆచితూచి ఎదుర్కోవడం కోహ్లీసేనకు అవసరం. టీమిండియాపై 9 టెస్టులాడిన అతను 29.52 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్‌లో 5 టెస్టుల్లోనే 22.40 సగటుతో 27 వికెట్లు తీయడం గమనార్హం. ఇక 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో బౌల్ట్ చేసిన నష్టాన్ని భారత అభిమానులు ఇంకా మర్చిపోనేలేదు. మరో ఎండ్‌లో ఇంకెవరైనా ఒత్తిడి చేస్తుంటే.. ఇంకో ఎండ్‌లో బౌల్ట్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అందుకే సౌథీతో కలిసినప్పుడు అతడిని ఎదుర్కోవడం కష్టం. రోజ్‌బౌల్‌లో చల్లని వాతావరణం ఉంటే బౌల్ట్‌ను అడ్డుకోవడం బ్యాటు మీద సామే!

టిమ్‌ సౌథీ డేంజర్..

టిమ్‌ సౌథీ డేంజర్..

కివీస్ మరో పేస్ అస్త్రం టిమ్ సౌథీతో‌ను కోహ్లీసేనకు కష్టాలు తప్పవు. టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అత్యధిక వికెట్లు తీసిన అతను టాప్‌-5లో నిలిచాడు. కివీస్‌ విజయాలకు కారణం అతని బౌలింగే. అత్యంత వేగంతో పదునైన బంతులు విసరగలడు. పిచ్‌లతో సంబంధం లేకుండా రాణించగలడు. పక్కాగా వలపన్ని ప్రత్యర్థిని ఉచ్చులో పడేయడం సౌథీ ప్రత్యేకత.

భారత్‌పై అతనికి మంచి రికార్డుంది. 8 మ్యాచుల్లో 24.46 సగటుతో 39 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్‌ గడ్డపై 6 మ్యాచుల్లో 28.37 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. మొన్నటి లార్డ్స్‌ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి హడలెత్తించాడు. పైగా కోహ్లీపై అతనిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు 10సార్లు అతన్ని ఔట్‌ చేశాడు. షార్ట్‌పిచ్‌లో బంతులేసి బ్యాక్‌ఫుట్‌తో ఆడేలా చేస్తాడు. ఆపై దేహానికి దూరంగా బంతిని కాస్త ఫుల్‌ చేసి డ్రైవ్‌ చేసేలా ఉసిగొల్పి కోహ్లీని బుట్టలో పడేస్తాడు. అందుకే అతడితో జాగ్రత్త తప్పదు.

మరొకడు మ్యాట్ హెన్రీ

మరొకడు మ్యాట్ హెన్రీ

ట్రెంట్ బౌల్ట్, సౌథీ ఇద్దరు చాలదన్నట్లు.. వీరికి మ్యాట్ హెన్రీ తోడయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడైతే ఎలా ఉంటుందో.. ఈ ముగ్గురు కలిస్తే అలానే ఉంటుంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. 140 కి.మీ వేగంతో బంతులను స్వింగ్‌ చేసే అతనికి ఇంగ్లండ్‌ వాతావరణం సరిగ్గా సరిపోతుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ ఫైనల్‌ చేరడంలో 14 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. హెన్రీ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం కోహ్లీసేనకు అవసరం. లేదంటే ప్రపంచకప్‌ సెమీస్‌లో రోహిత్‌ (1), రాహుల్‌ (1) ఔటైన పరిస్థితులను అతడు సృష్టించగలడు. అంచనాలన్నీ బౌల్ట్‌, సౌథీపై ఉంటాయి కాబట్టి చాప కింద నీరులా హెన్రీ వికెట్లు తీసేస్తుంటాడు. టీమిండియాపై అతడు 2 టెస్టుల్లో 6 వికెట్లు, ఇంగ్లండ్‌లో 3 టెస్టులాడి 14 వికెట్లు తీశాడు.

దూసుకొచ్చిన కాన్వే..

దూసుకొచ్చిన కాన్వే..

టీమిండియా పతనాన్ని శాసించేందుకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి డెవాన్ కాన్వే దూసుకొచ్చినట్లున్నాడు. అటు స్పిన్‌ ఇటు పేస్‌ను సమర్థంగా ఆడటం ఈ కివీస్‌ ఓపెనర్‌ ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లోకి కొత్తగా వచ్చానన్న బెరుకే అతనిలో కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో 2 టెస్టుల సిరీసులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 76.50 సగటు, 54.84 స్ట్రైక్‌రేట్‌తో 306 రన్స్ చేశాడు. ఇక లార్డ్స్‌లో డబుల్ సెంచరీతో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఆడింది 3 వన్డేలే అయినా 75 సగటు, 88.23 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు బాదేశాడు. 11 టీ20 ఇన్నింగ్సుల్లో 59.12 సగటుతో 473 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే కాన్వేను ఔట్‌ చేయడం సులభం కాదు. వీలైనంత త్వరగా ఈ ఓపెనర్‌ను పెవిలియన్‌ పంపించకపోతే అంతే సంగతులు.

కేన్ మామతో కష్టమే..

కేన్ మామతో కష్టమే..

ఇక కేన్ విలియమ్సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌పై అతనికి మంచి రికార్డుంది. అంతేకాకుండా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. భారత్ పై 11 టెస్టుల్లో 36.40 సగటుతో 728 పరుగులు చేశాడు. 2 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ గడ్డపై 5 టెస్టుల్లో 26.10 సగటుతో 261 పరుగులే చేశాడు. ఇంగ్లిష్‌ వాతావరణంలో పెద్దగా పరుగులు చేయకపోవడం సానుకూలాంశమే అయినా ఆదమరిస్తే ప్రమాదం తప్పదు. ఎందుకంటే తటస్థ వేదికపై ఇద్దరికీ అవకాశాలు సమంగానే ఉంటాయి. అతడు పేస్‌తో పాటు స్పిన్‌నూ సమర్థంగా ఎదుర్కోగలడు. అశ్విన్‌, బుమ్రా అతడిని నిలవకుండా అడ్డుకోవాలి.

Story first published: Tuesday, June 15, 2021, 13:53 [IST]
Other articles published on Jun 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+