Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ-అనుష్కల పెళ్లిని పట్టించుకోని ఆ ఐదుగురు ఎవరు?

5 popular Indian cricketers who didn’t wish “Virushka”

హైదరాబాద్: టాప్ సెలబ్రిటీలు, వేర్వేరు రంగాల్లో పైస్థాయిలో ఉన్న వారు ప్రేమించుకున్నారు. ఆశ్యర్యం. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది ఇంకా అద్భుతం. మరి వాళ్ల అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎంత మంది ఎన్ని రకాలుగా శుభాకాంక్షలు తెలిపి ఉంటారో కదా.. అవును సరిగ్గా అలాగే విరాట్ కోహ్లీ అనుష్కల పెళ్లి జరిగింది.

రూ. 1000 కోట్లకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల నెట్ వర్త్

కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. చిన్న మనస్పర్థలు వచ్చాయి. అందరూ ఆల్ మోస్ట్ అందరూ విడిపోయారనుకున్నారు. కానీ, ప్రేమ బంధం వారిద్దరినీ మళ్లీ కలిపింది. ఈ సారి బంధం ఇంకాస్త బలపడింది. వారు వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఇక వారి పెళ్లి మామూలు స్థాయిలో జరగలేదు. లక్షలు ఖర్చుపెట్టి విదేశాల్లో పూర్తి చేశారు. ఏకంగా తన ప్రేయసి ఇల్లాలు కాబోతుందన్న ఆనందంలో విరాట్ కోహ్లీ 97లక్షలు పెట్టి ఉంగరం కొన్నాడు. స్నేహితులు, బంధువులు సమక్షంలో జరిగిన పెళ్లికి అందరినీ ఆహ్వానించకపోయినా ఆ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఆ జంట పంచుకుంది.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే ఆన్‌లైన్ కావడంతో వారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు పంపుతూనే ఉన్నారు. పెళ్లైందని ఆ జంట బయటపెట్టినప్పటి నుంచి ట్వీట్ల వరద ముంచుకొస్తూనే ఉంది. చివరకు విమర్శకులు సైతం నవ్వుతూ శుభాకాంక్షలు తెలిపారు.

కానీ, ఇవేమీ పట్టనట్టు ఉన్నారు. ఆ అయిదుగురు. ఈ జంటకు పరిచయం లేని వారో.. లేదా శత్రువులో కాదు. సహచరులూ, శ్రేయాభిలాషులు అనిపించుకునే వాళ్లు. కారణాలు ఏం జరిగింటాయో సందిగ్ధం.
వారే.. మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, రవి శాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే.

ధోనీ:

ధోనీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడు. కానీ, సహచరుడి పెళ్లిని కూడా పట్టించుకోవడం గమనార్హం.

రవిశాస్త్రి:

భారత్ జట్టుకు ప్రధాన కోచ్ హోదాలో కొనసాగుతున్న రవిశాస్త్రి. ఇతనంటే విరాట్ కోహ్లీకి ఎక్కడలేనంత అభిమానం. ఇద్దరూ మధ్య మంచి రాపో ఉంది. అయినా ఇలా ఎలా..?

యువరాజ్ సింగ్:

మొండి మనిషి యువరాజ్ సింగ్. అలాగే సున్నిత మనస్కుడు కూడా. కాన్సర్ వచ్చినప్పుడు గుండె ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎవరైనా ఆపదలో ఉంటే అందరికంటే ముందు స్పందిస్తాడు. కానీ, ఇప్పుడు మాత్రం ఏం పట్టనట్లున్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్:

వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. ఈ క్రికెటర్ విష్ చేసేప్పుడు ప్రత్యేకత ఉండాలనుకుంటున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మొన్నటికి మొన్న యువరాజ్ సింగ్ బర్త్ డేకి ఏ, బీ, సీ, డీ లు అన్నీ చెప్పి వీటన్నిటి కంటే యువరాజ్ సమ్‌థింగ్ స్పెషల్ అన్నాడు.

అనిల్ కుంబ్లే:

ఎంత పాత గొడవలున్నా, మరీ జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి దగ్గర కూడా పంతాలు చూపించాలా. అంతకుముందు ఓ క్రికెటర్ ఎంపిక నేపథ్యంలో అప్పటి కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లేకు విరాట్ కోహ్లీకి మనస్పర్థలు వచ్చింది తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 12:50 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+