For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఆ నలుగురు ఔట్.. ఆర్‌సీబీ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. రజత్ పటిదార్ సారథ్యంలో తొలి టైటిల్‌ను అందుకుంది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ అలుపెరుగని కృషికి ఫలితం దక్కింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచినా.. జట్టులో కొన్ని లోపాలున్నాయి. అప్‌కమింగ్ సీజన్‌కు ముందు ఈ బలహీనతలను అధిగమించి జట్టును మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన ఓ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయనుంది.

1. లియామ్ లివింగ్ స్టోన్


ఐపీఎల్ 2025 మెగా వేలంలో లియామ్ లివింగ్ స్టోన్‌ను ఆర్‌సీబీ రూ. 8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడని ఆశించింది. తన పవర్ హిట్టింగ్‌ జట్టుకు కొండంత అండగా మారుతుందని భావించింది. కానీ అతను మాత్రం ఆర్‌సీబీ అంచనాలను అందుకోలేకపోయాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 112 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 54. ఫైనల్లో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసాడు. అతని స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతోనే లివింగ్ స్టోన్‌ను వదిలేసి బడ్జెట్‌ను ఆదా చేసుకోవచ్చు.

5 Players RCB Likely to Release Ahead of IPL 2026 PBKSni-Auction

2. రసిక్ సలామ్ దార్

అనామక ప్లేయర్ రసిక్ సలామ్ దార్‌ను రూ. 6 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ యువ పేసర్ ఒకే ఒక్క వికెట్ తీసాడు. 10.50 ఎకానమీతో పరుగులు ఇవ్వడంతో ఆర్‌సీబీ అతన్ని పూర్తిగా బెంచ్‌కే ప్రయత్నం చేసింది. ఆర్‌సీబీ అంచనాలను అందుకోలేకపోయిన రసిక్ సలామ్‌దార్‌ను వదిలేసి మరో ఇండియన్ పేసర్‌‌ను తీసుకోవాలనే యోచనలో ఆర్‌సీబీ ఉన్నట్లు తెలుస్తోంది.

3. నువాన్ తుషార

ఐపీఎల్ 2025 వేలంలో నువాన్ తుషారను ఆర్‌సీబీ రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. జోష్ హజెల్ వుడ్ గైర్హాజరీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన నువాన్ తుషార 26 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసాడు. పరిమిత అవకాశాలే రావడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఓవర్‌సీస్ ఆటగాళ్ల స్లాట్స్ నేపథ్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్‌సీబీ వదిలేసే అవకాశం ఉంది.

4. టీమ్ సీఫెర్ట్

జాకోబ్ బెతెల్ స్థానంలో తాత్కలిక రిప్లేస్‌మెంట్‌గా ఆర్‌సీబీ జట్టులోకి వచ్చిన టీమ్ సీఫెర్ట్‌ను.. రూల్స్ ప్రకారం వచ్చే సీజన్‌కు ముందు ఆర్‌సీబీ వదిలేయనుంది. తాత్కలిక రిప్లేస్‌మెంట్ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇవ్వలేదు. వెస్టిండీస్‌తో సిరీస్‌ నేపథ్యంలో జాకోబ్ బెతెల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాత్కలిక రిప్లేస్‌మెంట్‌గగా జట్టులోకి వచ్చిన టీమ్ సీఫెర్ట్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.

Story first published: Friday, June 6, 2025, 18:10 [IST]
Other articles published on Jun 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+