For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. ముంబై ఇండియన్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కే పరిమితమైంది. అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటములతో ఈ టోర్నీని ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. జస్‌ప్రీత్ బుమ్రా రాకతో విజయాల బాట పట్టింది. వరుసగా 6 విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది.

ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కానీ కీలక మ్యాచ్‌లో తడబడింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై ఓటమిని శాసించింది. ఫైనల్ చేరకున్నా ముంబై ఇండియన్స్ జట్టు బలంగానే ఉంది. కానీ జట్టు లోపాలను సరిదిద్దుకునేందుకు ముంబై ఇండియన్స్ కొంతమంది ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోనుంది.

5 Players Mumbai Indians Likely To Release ahead of IPL 2026 Mini-Auction

1. రోహిత్ శర్మ..
ఐపీఎల్ 2026 సీజన్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ‌కు ఫిట్‌నెస్ సవాల్‌గా మారనుంది. కేవలం వన్డే ఫార్మాట్ ఆడుతూ రిథమ్ అందుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ పర్వాలేదనిపించాడు. 15 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలతో 418 పరుగులు చేశాడు. ఒకవేళ అతను రిటైర్మెంట్ ప్రకటించకుండా అందుబాటులో ఉంటే జట్టులో కొనసాగుతాడు. లేదంటే జట్టుకు దూరమవుతాడు.

2.సత్యనారయణ రాజు
తెలుగు ప్లేయర్ సత్యనారయణ రాజును ముంబై ఇండియన్స్‌ వదులకునే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీలో అతనికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2 మ్యాచ్‌లు ఆడి 13.25 ఎకానమీతో ఒకే ఒక్క వికెట్ తీసాడు. అతన్ని వదిలేసి మరో భారత పేసర్‌ను ముంబై ఇండియన్స్ ఎంచుకోవచ్చు.

3.దీపక్ చాహర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్‌ను కూడా ముంబై వదిలేయవచ్చు. అతను జట్టు ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌లు ఆడి 9.17 ఎకానమీతో 11 వికెట్లు మాత్రమే తీసాడు. కీలక మ్యాచ్‌ల ముందు గాయపడి జట్టుకు తీరని నష్టం చేశాడు. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే దీపక్ చాహర్‌ను వదిలేసి ఓ స్టార్ పేసర్‌ను కొనుగోలు చేయాలని ముంబై భావిస్తోంది.

4. జానీ బెయిర్ స్టో..
తాత్కలిక రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన జానీ బెయిర్ స్టోను కూడా ముంబై ఇండియన్స్ వదిలేయాల్సిందే. ర్యాన్ రికెల్టన్ స్థానంలో వచ్చిన జానీ బెయిర్ స్టో రెండు మ్యాచ్‌ల్లో దుమ్మురేపాడు. అతన్ని జట్టులో కొనసాగించాలనుకున్నా.. బీసీసీఐ అనుమతించదు. ఈ క్రమంలోనే ర్యాన్ రికెల్టన్‌ను వదిలేసి ఐపీఎల్ 2026 మినీ వేలంలో జానీ బెయిర్ స్టోను తీసుకోవచ్చు. లేదంటే ర్యాన్ రికెల్టన్ ఉంచుకొని బ్యాకప్‌గా జానీ బెయిర్ స్టోను కొనుగోలు చేయవచ్చు.

5.ముజీబ్ ఉర్ రెహ్మాన్..
అఫ్గాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ ‌కు రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కూడా ముంబై వదిలేయనుంది. అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడి తీవ్రంగా నిరాశపర్చాడు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్‌కు సెట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసే ఛాన్స్ ఉంది.

Story first published: Tuesday, June 3, 2025, 15:41 [IST]
Other articles published on Jun 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+