Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. గుజరాత్ టైటాన్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్‌కే పరిమితమైంది. అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఓ దశలో టేబుల్ టాపర్‌గా కొనసాగింది. అందరి కన్నా ముందే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో తడబడి టాప్-2 ప్లేస్‌‌ను కోల్పోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ ఆసాంతం గుజరాత్ టైటాన్స్ టాప్-3 బ్యాటర్లే రాణించారు. ముఖ్యంగా లోయరార్డర్ వైఫల్యం గుజరాత్ టైటాన్స్ కొంపముంచింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఐదుగురు ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది.

1. రషీద్ ఖాన్..
ఐపీఎల్ 2022 సీజన్ నుంచి రషీద్ ఖాన్.. గుజరాత్ టైటాన్స్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత మూడు సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేసిన ఈ అఫ్గాన్ బౌలర్.. ఈ సారి మాత్రం తేలిపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు మాత్రమే తీసాడు. 9.39 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేశాడు. ధారళంగా పరుగులిచ్చాడు. గతంలో రషీద్ ఖాన్ అంటే బ్యాటర్లు భయపడేవారు. కానీ ఈసారి సునాయసంగా ఆడారు. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్‌ను వదిలేసి ఇండియన్ స్పిన్నర్‌ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది.

5 Players Gujarat Titans Likely To Release ahead of IPL 2026 Mini-Auction

2.షారూఖ్ ఖాన్
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ బ్యాటర్లకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సుదర్శన్-గిల్-బట్లర్ ప్రతీ మ్యాచ్‌లో రాణించారు. షారూఖ్ ఖాన్ కంటే ముందు ఆడిన షెర్ఫెన్ రూదర్‌ఫోర్డ్ సైతం మెరుగ్గా రాణించాడు. కానీ ఫినిషర్‌గా సత్తా చాటుతాడని భావించిన షారూఖ్ ఖాన్ తీవ్రంగా నిరాశపర్చాడు. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన షారూఖ్‌పై గుజరాత్ మేనేజ్‌మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ షారూఖ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 147 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అతని కంటే మెరుగైన ఫినిషర్‌ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది.

3. ఇషాంత్ శర్మ..
వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పర్వాలేదనిపించినా.. అతని వయసు, ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో గుజరాత్ వదులుకునే అవకాశాలు ఉన్నాయి. 7 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ 4 వికెట్లు తీసాడు. కానీ ధారళంగా పరుగులిచ్చాడు. అతని స్థానంలో యంగ్ ఇండియన్ పేసర్‌ను గుజరాత్ తీసుకోవచ్చు.

4. రాహుల్ తెవాటియా
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన రాహుల్ తెవాటియా కూడా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తక్కువ మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మంచి ఫినిషర్‌గా పేరొందిన రాహుల్ తెవాటియా.. ఈ సీజన్‌లో తన బాధ్యతలను నిర్వర్తించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి ప్రతిభ కలిగిన ఫినిషర్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

5. కరీమ్ జనత్..
కరీమ్ జనత్‌కు ఈ సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అతనికి ఒక మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా తన తొలి ఓవర్‌లోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో గుజరాత్ అతన్ని పూర్తిగా పక్కనపెట్టింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఇప్పటికే కావాల్సిన పేస్ బౌలర్లు ఉన్నారు. కాబట్టి అతన్ని వదిలేసి భారత పేసర్‌ కోసం ప్రయత్నించవచ్చు.

Story first published: Sunday, June 1, 2025, 18:42 [IST]
Other articles published on Jun 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+