Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జీరో బాల్‌కే వికెట్.. సౌతాఫ్రికాతో వికెట్ కీపర్‌గా! కోహ్లీ గురించి పెద్దగా తెలియని ఆసక్తికర విషయాలు!

5 lesser known facts about Virat Kohli, who lost form recently

హైదరాబాద్: ఒకప్పుడు సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు ఉంటే.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే మరో వైపు ఉండేవాడు. అతని మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు ... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా.. అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై ఎనిమిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు.

మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి గత మూడేళ్లుగా తడబడుతున్నాడు. అలవోకగా సెంచరీలు బాదిన అతని బ్యాట్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఆడలేకపోతుంది. క్రీజులో డ్యాన్స్‌ను తలపించే అతని ఫుట్ వర్క్.. ఇప్పుడు తడబడుతుంది. ప్రస్తుతం క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన విరాట్.. మళ్లీ ఘనంగా రీఎంట్రీ ఇవ్వడంపై కసరత్తులు చేస్తున్నాడు. అయితే అతని 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన ఘటనలున్నాయి. అయితే ఓ ఐదు ఆసక్తికర విషయాలు మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. వాటిపై ఓ లుక్కెద్దాం.

1. జీరో బాల్‌కే వికెట్..

1. జీరో బాల్‌కే వికెట్..

టీ20 క్రికెట్ చరిత్రలోనే జీరో బాల్‌కు వికెట్ తీసిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. స్టార్ బ్యాటర్ అయిన కోహ్లీ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. తన జీరో డెలివరీతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ తన కెరీర్ ఫస్ట్ ఓవర్ వేసాడు. అయితే ఈ ఓవర్ తొలి బంతిని అతను వైడ్‌గా వేయగా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పీటర్సన్ క్రీజును ధాటాడు. ఇక అప్పటి వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ బంతిని అందుకొని స్టంపౌట్ చేశాడు. దాంతో జీరో బాల్‌కే వికెట్ తీసిన ఘనతను విరాట్ అందుకున్నాడు.

2. సౌతాఫ్రికాతో వికెట్ కీపర్‌గా..

2. సౌతాఫ్రికాతో వికెట్ కీపర్‌గా..

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ అదరగొట్టడం అందరికి తెలిసిందే. కానీ విరాట్ కోహ్లీ కీపింగ్ చేసిన విషయం ఎవరికీ తెలియదు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు కోహ్లీ వికెట్ కీపింగ్ చేశాడు. సౌతాఫ్రికాతో జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో మొదటి సారి కీపింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 44వ ఓవర్‌ను ధోనీ బౌలింగ్ చేయగా... ఆ ఓవర్ పాటు గ్లౌవ్స్ ధరించి విరాట్ కీపింగ్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ టాయిలెట్‌కు వెళ్లగా విరాట్ ఒక ఓవర్ పాటు కీపింగ్ చేశాడు. ఈ రెండు సందర్భాలు పెద్దగా ఎవరికీ తెలియవు.

3. ఐపీఎల్ వేలానికి వెళ్లని కోహ్లీ..

3. ఐపీఎల్ వేలానికి వెళ్లని కోహ్లీ..

ఐపీఎల్‌లో వేలానికి వెళ్లని ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర సీజన్ మినహా మళ్లీ విరాట్ వేలంలో పాల్గొనలేదు. 2008లో ఆర్‌సీబీ అతన్ని తీసుకోగా.. ఆ తర్వాత ప్రతీ సీజన్ రిటైన్ చేసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే వేలానికి వెళ్లని ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇక ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు(973) చేసిన రికార్డు కూడా కోహ్లీదేనన్న విషయం తెలిసిందే.

4. అరంగేట్ర వరల్డ్‌కప్‌లో సెంచరీ..

4. అరంగేట్ర వరల్డ్‌కప్‌లో సెంచరీ..

అరంగేట్ర ప్రపంచకప్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ విరాట్ కోహ్లీకి తొలి ప్రపంచకప్‌ కాగా.. ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయ సెంచరీ సాధించాడు. ఈ మ్యా‌చ్‌లో భారత్ 87 పరుగులతో గెలుపొందింది.

5. కరీష్మా కపూర్ అంటే పిచ్చి..

5. కరీష్మా కపూర్ అంటే పిచ్చి..

విరాట్ కోహ్లీ అభిమాన హీరోయిన్ కరీష్మా కపూర్. ఆమె అంటే అతనికి చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూలో తెలిపాడు. చిన్న వయసులో కరీష్మా కపూర్ తన డ్రీమ్ గర్ల్ అని కూడా పేర్కొన్నాడు. ఇక బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మను కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి వామిక పుట్టింది. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీతోనే లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.

Story first published: Thursday, July 21, 2022, 11:22 [IST]
Other articles published on Jul 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+