Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ritika Sajdeh Hot Photos: ఆకట్టుకునే అందం.. రోహిత్ భార్య సొంతం!

5 Hottest pics of Rohit Sharma wife Ritika Sajdeh from ipl 2022 goes viral

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. తన సగం బలం సతీమణి రితికా సజ్డేనని చెబుతుంటాడు. తనలో సగం ఆమెనేనని, తనకు బిగ్గెస్ట్ సపోర్టని ఎప్పుడూ చెబుతుంటాడు. ఇక రోహిత్‌ డిసెంబర్ 13, 2015 న రితికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి సమైరా పుట్టింది. రితికా డిగ్రీ పూర్తి చేసింది. అలాగే స్పోర్ట్స్​ మేనేజర్​గా పనిచేస్తోంది​. అంటే ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, స్పోర్ట్స్​ ఈవెంట్లు, మ్యాచ్​లు నిర్వహిస్తూ ఉంటారు. క్రికెట్​తో పాటు పలు క్రీడలపై రితికకు మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ మేనేజర్‌గా కొనసాగుతున్న ఆమె.. అంతకుముందు యువ రాజ్ సింగ్, విరాట్ కోహ్లీలకు స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహరించింది.

తొలి చూపులోనే..

తొలి చూపులోనే..

యువరాజ్ సింగ్ వద్ద రితికా సజ్డే స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమెను చూసిన రోహిత్ మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత మాట కలిపి మెల్లగా లైన్‌లో పెట్టి తన ప్రేమలో పడేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్.. యువరాజ్ సింగ్ చేత బెదరింపులకు కూడా గురయ్యాడు. రితికాను సోదరిగా భావించిన యువీ.. ఆమెతో రాఖీ కూడా కట్టించుకునేవాడు.

యాడ్ షూట్ సందర్భంగా..

యాడ్ షూట్ సందర్భంగా..

అయితే ఓ సారి యాడ్ షూటింగ్ సందర్భంగా యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్‌లతో కలసి రోహిత్ ఉండగా.. అక్కడికి రితికా వచ్చింది. అప్పుడే రితికాను రోహిత్ తొలిసారి చూశాడు. ఆమె అందం, అభినయాకి పడిపోయిన మనోడు అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన యువీ.. రోహిత్ శర్మను మందలించాడట.

యువీ వార్నింగ్...

యువీ వార్నింగ్...

'అలా చూడకు.. ఆమె నా చెల్లి'అని వార్నింగ్ ఇచ్చాడట. ప్రముఖ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ యొక్క 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' షోలో రోహిత్ ఈ విషయాలను వెల్లడించాడు. యువరాజ్ వార్నింగ్‌తో స్టన్ అయిన అతను.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశానని తెలిపాడు. యువరాజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రితికాను రోహిత్ అదే విధంగా చూశాడంట. షూటింగ్ ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడట.

మోకాళ్లపై కూర్చోని..

మోకాళ్లపై కూర్చోని..

ఏదైనా ప్రాబ్లెం ఉంటే నాకు చెప్పండి.. నేను చేసి పెడతాను అని అడిగాడట. అలా వారిద్దరి ప్రయాణం మొదలైంది. ఆ కొద్ది రోజులకు రోహిత్ దగ్గర స్పోర్ట్స్ మేనేజర్‌గా రితికా చేరడంతో వారి ప్రేమకు అడ్డంకి లేకుండా పోయింది. ఇక ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌లో రితికాకు రోహిత్ మోకాళ్లపై కూర్చొని రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేశాడట.

ఏడేళ్ల దిశగా..

ఏడేళ్ల దిశగా..

11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ కబ్ల్‌లో క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. తన ప్రేమను కూడా ఇక్కడే తెలియజేశాడట. ఆ తర్వాత వారి పరిణయం వివాహ బంధానికి దారి తీసి 6 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక రోహిత్- రితికా ప్రస్తావన వచ్చినప్పుడల్లా యువీ ఎపిసోడ్‌ను అభిమానులు గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌ను ఆస్వాదిస్తున్న రితికా.. మైదానంలో ప్రతీ మ్యాచ్ చూస్తూ భర్తను ఎంకరేజ్ చేస్తోంది. తన హవాభావాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Story first published: Monday, May 9, 2022, 15:54 [IST]
Other articles published on May 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+