Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్లామర్ డోస్ పెంచిన మిథాలీ రాజ్.. ‘శభాష్ మిథూ’ ప్రమోషన్స్‌‌లో స్కిన్ టైట్ డ్రెస్‌‌తో సెగలు..!

5 Hottest Pics Of Mithali Raj From Shabaash Mithu Pramotions Goes Viral

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. గ్లామర్‌పై ఫోకస్ పెట్టినట్లుంది. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికిన ఈ హైదరాబాద్ స్టార్ ప్రస్తుతం తన బయోపిక్ 'శభాష్ మిథూ' ప్రమోషన్స్‌లో బిజీగా బిజీగా పాల్గొంటోంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌ కోసం స్లీవ్‌ లెస్ టాప్‌ ధరించిన హాట్ ఫోటోలను మిథాలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

అయితే మిథాలీ ఇలా హాట్ హాట్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. బాలీవుడ్ హీరోయిన్లను తలపించే ఆమె.. గతంలో అనేక మ్యాగజైన్ల కోసం హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఒళ్లంతా నూనె రాసుకొని బనియన్‌పై దిగిన ఫొటోలు అప్పట్లో గ్లామర్ ప్రపంచాన్ని ఊపేసాయి. ఇక అందాలను చూపించడంలో ఏ మాత్రం మొహమాటపడని మిథాలీ రాజ్‌... ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది...

5 Hottest Pics Of Mithali Raj From Shabaash Mithu Promotions Goes Viral

జూలై 15న విడుదల కాబోతున్న తన బయోపిక్‌కి హైప్ తెచ్చేందుకు తన గ్లామర్ యాంగిల్ కూడా వాడుతోంది. 1999లో టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన మిథాలీరాజ్.. భారత మహిళ క్రికెట్‌కు ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డుకెక్కింది. లేడీ సచిన్‌గా అభిమానుల మనన్నలు అందుకుంది.

5 Hottest Pics Of Mithali Raj From Shabaash Mithu Promotions Goes Viral

ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరకుండానే మిథాలీ రాజ్ తన కెరీర్ ముగించింది. అయితే మరో ప్రపంచకప్ ఆడే పరిస్థితి లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. 'ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేం కాదు. చాలా ముందే అనుకున్నాను. వన్డే ప్రపంచకప్‌లో నిరాశ ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టింది. ప్రపంచకప్‌ సాధించాలని కలగన్నాను.

5 Hottest Pics Of Mithali Raj From Shabaash Mithu Promotions Goes Viral

ఇంకో ప్రపంచకప్‌ ఆడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు క్రికెట్లో కొనసాగడంలో అర్థం లేదు. ఇంతకాలం ఏ లక్ష్యంతో ఆడానో దాన్ని అందుకోలేకపోయాను. అందుకే ఇంకొంతకాలం ఆడే సత్తా ఉన్నప్పటికీ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను.'అని చెప్పింది.

Story first published: Monday, July 11, 2022, 17:14 [IST]
Other articles published on Jul 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+