For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sania Mirza: ఆట కన్నా అందానికే ఫ్యాన్స్ ఎక్కువ! మతిపొగోట్టే సానియా ఫొటోలు!

5 Hottest Photos Sania Mirza You Shouldnt Miss After Announcing Her Retirement

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ఈ సీజన్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ప్రకటించింది. తన కెరీర్‌లో ఈ 2022 సీజనే చివరిదని తెలిపింది. ఈ సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫస్ట్ రౌండ్‌లోనే ఓటమిపాలైన ఈ హైదరాబాద్ స్టార్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే సానియా మీర్జా ఆట కన్నా ఆమె అందానికే అభిమానులు ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్‌ను మించిన అందం సానియా సొంతం. ఆమె కోసం అప్పట్లో అభిమానులు పడి చచ్చారు. పెళ్లి వార్త తెలిసి ఇళ్ల ముందు ధర్నాలు చేశారు. అలాంటి సానియాకు సంబంధించిన హాట్ పిక్స్‌పై ఓ లుక్కెయ్యండి.

5 Hottest Photos Sania Mirza You Shouldnt Miss After Announcing Her Retirement

ఇక పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సానియా.. 2018లో ఓ కొడుకు జన్మనిచ్చింది. దాంతో ఆమె సుమారు రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది. సుదీర్ఘ విరామం తర్వాత తీవ్రంగా చమటోడ్చి 26 కిలోల బరువు తగ్గిన సానియా.. రీఎంట్రీలో అదరగొట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో జత కట్టిన సానియా.. ఫస్ట్ టోర్నీహోబర్ట్ ఇంటర్నేషనల్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా బరిలోకి దిగింది. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఓటమిపాలైంది. తొలి రౌండ్‌లోనే సానియా ద్వయం 4-6, 6-7(5) తేడాతో స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ చేతిలో ఖంగుతిన్నది.

5 Hottest Photos Sania Mirza You Shouldnt Miss After Announcing Her Retirement

ఈ ఓటమి నేపథ్యంలోనే సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. 'ఇదే నా చివరి సీజన్ అని నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నా. ఈ సీజన్ మొత్తం ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను" అని సానియా తెలిపింది. సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ బరిలోకి దిగనుంది.

5 Hottest Photos Sania Mirza You Shouldnt Miss After Announcing Her Retirement

2013లోనే సింగిల్స్ ఆడటం మానేసిన సానియా డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా అందుకుంది. దాదాపు 91 వారాలా పాటు నంబర్‌వన్‌గా కొనసాగింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 270 ప్లస్ సింగిల్స్ విజయాలందుకున్న హైదరాబాద్ ప్లేయర్.. డబుల్స్‌లో 500 ప్లస్ విక్టరీలు నమోదు చేసింది. సింగిల్స్‌లో సానియా అత్యుత్తమ ర్యాంక్ 27 కాగా.. డబుల్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక సింగిల్స్ టైటిల్‌తో పాటు 40 డబుల్స్ టైటిల్స్, 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుపొందింది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో సానియా 14 పతకాలను సాధించింది. అందులో 6 బంగారు పతకాలున్నాయి.

Sania Mirza కేంద్రంగా డిబేట్.. Teamindia Vs Pak | T20 World Cup || Oneindia Telugu
5 Hottest Photos Sania Mirza You Shouldnt Miss After Announcing Her Retirement
Story first published: Wednesday, January 19, 2022, 17:09 [IST]
Other articles published on Jan 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+