Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా సెలెక్షన్ కమిటీపై వేటు‌కు కారణాలివే! కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు..

5 Big reasons for BCCI sacked Chetan Sharma selection committee

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఈ వైఫల్యానికి గల కారణాలను అన్వేషిస్తున్న బీసీసీఐ ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు చేసింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో పాటు నలుగురు సెలెక్షన్ కమిటీ సభ్యులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ.. ఈ సెలెక్షన్ కమిటీని నియమించగా.. కొత్త అధ్యక్షునిగా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే వారిపై వేటు వేయడం చర్చనీయాంశమైంది. అయితే చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేయడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2022 వైఫల్యం..

టీ20 ప్రపంచకప్ 2022 వైఫల్యం..

గత 9 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియాకు ఆ ముచ్చట తీర్చడే లక్ష్యంగా ఏర్పాటు చేసిన చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా సరైన జట్టును ఎంపిక చేయలేకపోయింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో పాటు గతేడాది జరిగిన ప్రపంచకప్‌కు సరైన జట్టును ఎంపిక చేయలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ ఈ ఏడాది వీలైనన్ని టీ20 సిరీస్‌లు ప్లాన్ చేసినా వాటిన సెలెక్షన్ కమిటీ సరిగ్గా వాడుకోలేకపోయింది. ప్రణాళికల్లో లేని అశ్విన్, షమీలను తీసుకొచ్చి మూల్యం చెల్లించుకుంది.

ఆసియా కప్ వైఫల్యం..

ఆసియా కప్ వైఫల్యం..

టీ20 ప్రపంచకప్ ముందు టీజర్‌గా జరిగిన ఆసియాకప్ 2022లో టీమిండియా ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్లను తరుచూ మార్చిన సెలెక్టర్లు.. సరైన జట్టును ఎంపిక చేయడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా సెలెక్టర్ల అతి జోక్యం కూడా బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. కొందరు సెలెక్టర్లు టీమ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన అతిగా ప్రవర్తించడం ఆటగాళ్లకు అసౌకర్యం కల్పించింది. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. వేటు వేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

కేఎల్ రాహుల్‌ను ఆడించడం..

కేఎల్ రాహుల్‌ను ఆడించడం..

గాయంతో సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్‌ను సీనియర్ ప్లేయర్ పేరిట నేరుగా ఆసియాకప్ 2022లో ఆడించడం సెలెక్టర్ల కొంపముంచింది. అతను ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ కీలక మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో సెలెక్టర్లపై తీవ్ర విమర్శలొచ్చాయి. రాహుల్ కంటే బాగా రాణిస్తున్న పృథ్వీ షా, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి వంటి యువ ప్లేయర్లను అస్సలు పట్టించుకోకపోవడం కూడా సెలెక్టర్ల వేటుకు కారణమైంది.

 బుమ్రా విషయంలో అత్యుత్సాహం..

బుమ్రా విషయంలో అత్యుత్సాహం..

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, దీపక్ చాహార్... ఇలా కీలక ఆటగాళ్లు టీమిండియాకి ఎంపికైన తర్వాత గాయపడ్డారు. వీరు గాయపడడానికి కారణాలేంటి? అనే విషయంపై సెలక్షన్ కమిటీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా వారి గాయాల పరిస్థితి తెలుసుకోకుండా మ్యాచ్‌లు ఆడించడం.. వారు మళ్లీ గాయపడటానికి కారణమవ్వడం కూడా సెలెక్షన్ కమిటీ వేటుకు దారి తీసింది.

విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం..

విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం..

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించడం కూడా చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై వేటుకు ప్రధాన కారణమైంది. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేసిన విరాట్.. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లో సారథిగా కొనసాగుతానని చెప్పాడు. కానీ వేర్వేరు కెప్టెన్ల పద్దతి భారత్‌కు సెట్ కాదని భావించిన సెలెక్షన్ కమిటీ బలవంతంగా అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీనిపై కోహ్లీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం.. టెస్ట్ కెప్టెన్సీ కూడా వదులు కోవడం వివాదాస్పదమైంది.

Story first published: Saturday, November 19, 2022, 16:23 [IST]
Other articles published on Nov 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+