1993 తర్వాత ఇదే: ముంబై ఆటగాడు లేకుండా ముంబై టెస్టు
హైదరాబాద్: టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఎనభై ఏళ్లుగా ఆనవాయితీ వస్తున్న ఓ సంప్రదాయానికి గురువారం (డిసెంబర్ 8) నాడు టీమిండియా చరమగీతం పాడింది. ముంబైలో జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో ముంబైకి చెందిన ఆటగాడు లేకుండా తొలిసారి టీమిండియా బరిలోకి దిగింది.
ఫోటోలు: సచిన్ వీడ్కోలు మ్యాచ్ తర్వాత జరిగే టెస్ట్ ఇదే
ఇలా బరిలోకి దిగడం గత 83 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 1933 నుంచి చూస్తే ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ముంబై ఆటగాడు తుది జట్టులో లేకుండా టీమిండియా బరిలోకి దిగలేదు. ముంబైలోని వాంఖడె స్టేడియానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 1974-75మధ్య భారత్-వెస్టిండీస్ మధ్య ఈ మైదానంలో మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది.

నాలుగో టెస్టులో ముంబైకి చెందిన ఆటగాడు లేకుండా
తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ముంబైకి చెందిన ఆటగాడు కనీసం ఒక్కరైనా ఉండేవారు. ఈ టెస్టుతో ముంబైకి చెందిన శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. అయితే తుది జట్టులో ఏ ఒక్క ముంబై ఆటగాడు కూడా తుది జట్టులో చోటు లభించలేదు.

అనాదిగా వస్తున్న సంప్రదాయానికి టీమిండియా చరమ గీతం
దీంతో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి టీమిండియా చరమ గీతం పాడింది. 1975 నుంచి 2013 వరకు వాంఖడె స్టేడియంలో జరిగిన ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ ముంబైకి చెందిన ఆటగాడికి తుది జట్టులో చోటు లభించింది. ఇక 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 2013లో వాంఖడెలోనే తన చివరి టెస్టు ఆడాడు.

గాయంతో రహానే మిగతా రెండు టెస్టులకు దూరం
ఆ తర్వాత ఈ స్టేడియంలో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్ నిర్వహించలేదు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుడిచేతి చూపుడు వేలికి గాయం కావడంతో ముంబైకి చెందిన రహానే మిగిలిన రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. లేదంటే తుది జట్టులో రహానే ఆడాల్సి ఉంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
అతడి స్ధానంలో కర్ణాటక ఆటగాడు మనీశ్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టుతో ఇంగ్లాండ్ ఆటగాడు జెన్నింగ్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్‌కు విశ్రాంతినివ్వడం ద్వారా అతని స్థానంలో జెన్నింగ్స్‌కు అవకాశం కల్పించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications