ఫోటోలు: సచిన్ వీడ్కోలు మ్యాచ్ తర్వాత జరిగే టెస్ట్ ఇదే
హైదరాబాద్: గురువారం (డిసెంబర్ 8)న ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. ఇక ముంబైలో జరగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ప్రణాళికలు రచిస్తుంది.
కోహ్లీసేనను ఎలాగైనా నిలువరించాలనే పట్టుదలతో కుక్ సేన పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో హమీద్, వోక్స్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలు పాలైనా, వాంఖడే స్టేడియంలో గత చరిత్ర తమకు కలిసొచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ భావిస్తోంది.

3 ఏళ్ల విరామం తర్వాత ముంబైలో టెస్టు
దాదాపు మూడేళ్ల విరామ అనంతరం వాంఖడె స్టేడియం టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తోంది. 2013లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మ్యాచ్ తర్వాత ఇక్కడ జరగనున్న తొలి టెస్టు ఇదే. క్రికెట్ లెజెండ్ సచిన్‌కి ఆడిన చివరి టెస్టు 200వ టెస్టు కావడం విశేషం.

విండిస్‌తో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల విజయం
సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్టుని నవంబర్ 14, 2013లో అభిమానుల మధ్య ఆడాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 74 పరుగులు సాధించాడు. వెస్టిండిస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వాంఖడెలో ఇంగ్లాండ్‌కు మంచి చరిత్ర
కాగా, వాంఖడె స్టేడియంలో ఇంగ్లాండ్‌కు మంచి చరిత్రే ఉంది. నాలుగో టెస్టులో ఇది ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అవకాశముంది. గతంలో వాంఖడెలో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శన చేసి ఈ సిరీస్‌లో పుంజుకోవాలనే ఆలోచనలో ఉంది.

అరుదైన రికార్డు ముంగిట టీమిండియా
వాంఖడెలో ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టులో టీమిండియా గనుక విజయం సాధిస్తే చరిత్రను సృష్టిస్తుంది. టెస్టు క్రికెట్‌లో వరుసగా టీమిండియా 17 విజయాలను సొంతం చేసుకుంది. 1985-87 మధ్య కాలంలో భారత్ జట్టు ఈ రికార్డుని నెలకొల్పింది.

మూడో రోజు నుంచి స్ఫిన్‌కు అనకూలం
మళ్లీ ఇప్పుడు ఆ రికార్డుని సమం చేసే అవకాశం టీమిండియాకు వచ్చింది. ఇక వాంఖడె పిచ్‌పై కొంత బౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పిన్‌కు మాత్రమే అనుకూలించే విధంగా పిచ్‌ను రూపొందించలేదని తెలిపారు. పద్ధతి ప్రకారం పిచ్‌పై నీళ్లు చల్లుతున్నామని, మంచు కురుస్తున్న నేపథ్యంలో దానినీ పరిగణనలోకి తీసుకుని వికెట్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications