Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఓవర్‌లో 46 పరుగులు! (వీడియో)

న్యూఢిల్లీ: క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టడమే గొప్ప. చాలా అరుదుగా బ్యాటర్లు ఈ ఘనతను అందుకుంటారు. అంతర్జాతీయంగా అతికొద్ది మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ నుంచి యువరాజ్ సింగ్ ఈ అరుదైన ఫీట్ సాధించగా.. దేశవాళీ క్రికెట్‌లో రవి శాస్త్రి 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.

6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది 36 పరుగులు పిండుకోవడమే గొప్ప అనుకుంటే.. తాజాగా ఓ బ్యాటర్ 46 పరుగులు నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు, రెండు బౌండరీల సాయంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఓవర్‌లో బౌలర్ రెండు నోబాల్స్ వేయడంతో ఆ బ్యాటర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు అవాక్కవుతున్నారు.

46 Runs in One Over

కువైట్‌లో జరుగుతున్న కేసీసీ ఫ్రెండీ ఛాంపియన్స్ ట్రోఫీ-2023లో భాగంగా ఎన్‌సీఎమ్ ఇన్వెస్ట్‌మెంట్-సీసీ ట్యాలీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదు అయ్యింది. సీసీ ట్యాలీ బౌలర్ హర్మన్ సింగ్ వేసిన 15వ ఓవర్‌లో ఎన్‌సీఎమ్ ఇన్వెస్టిమెంట్ బ్యాటర్ వాసుదేవ్ 46 రన్స్ పిండుకున్నాడు.

వరుసగా 6nb, 4b, 6, 6nb, 6, 6, 6, 4 పరుగులు చేశాడు. వాసుదేవ్ 40 పరుగులు చేయగా.. ఎక్స్‌ట్రాల రూపంలో 6 పరుగులు వచ్చాయి.ఈ ఓవర్ తొలి బంతి బౌలర్ చేతిలో నుంచి జారిపోగా.. హైఫుల్‌ టాస్‌ను వాసుదేవ్ సిక్సర్ కొట్టాడు. అంపైర్ నోబాల్ ఇవ్వడంతో బంతిపడకుండానే ఏడు పరుగులు వచ్చాయి.

మరుసటి బంతిని ఫుల్ టాస్ వేయగా.. బ్యాట్‌తో పాటు కీపర్‌ను మిస్సైన బంతి బౌండరీకి దూసుకెళ్లింది. రెండో బంతిని సిక్సర్ రాగా.. మూడో బంతిని నోబాల్‌గా వేయగా వాసుదేవ్ సిక్సర్ బాదాడు. అనంతరం మరో రెండు సిక్స్‌లు బాదిన అతను.. చివరి బంతిని బౌండరీకి తరలించాడు.

Story first published: Wednesday, May 3, 2023, 20:45 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+