పుట్టినరోజు సందర్భంగా ట్వీట్:
ఫిబ్రవరి 28న షాహిద్ అఫ్రిది తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. 'నా 44వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు. నా కుటుంబం మరియు నా అభిమానులు నాకు అతిపెద్ద ఆస్తులు. ముల్తాన్‌తో నా పనితీరును ఆస్వాదిస్తున్నా. ముల్తాన్ అభిమానులందరికీ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలను అందించాలని ఆశిస్తున్నా' అంటూ అఫ్రిది ట్వీట్ చేశాడు. ఇదే ఇప్పుడు అఫ్రిదికి తలనొప్పిగా మారింది.

ఇప్పటికైనా అసలు వయస్సు చెప్పాలి:
పీఎస్ఎల్ ప్రకారం 40, క్రిక్‌ఇన్ఫో ప్రకారం 41, ఆటోబయోగ్రఫీలో 46, ట్వీట్‌లో 44 ఇలా షాహిద్ అఫ్రిది వయస్సుపై క్లారిటీ లేదు. దీంతో పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్‌పై అఫ్రిదిని నెటిజన్లు ఆటాడుకున్నారు. 'అఫ్రిది.. ఇప్పటికైనా అసలు వయస్సు చెప్పాలి' అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఏడాది నీ వయస్సులో ఒక సంవత్సరం తగ్గుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్ లెక్కల ప్రకారం అఫ్రిది 1996లో 16 ఏళ్ల వయస్సులో అరంగేట్రం చేసినట్లు ఉంది. దాని ప్రకారం అఫ్రిది వయస్సు ప్రస్తుతం 41 ఏళ్లు. అంటే అఫ్రిది తన వయస్సు విషయంలో ఇప్పటికి కూడా నిజం దాస్తున్నట్లు తెలుస్తోంది.

1996 నాటికి 21 ఏళ్లు:
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వయసు ఇప్పటికీ ఓ మిస్టరీనే. 16 ఏళ్ల వయసులో 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన అఫ్రిది సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ అప్పటికి అతని వయసు 16 ఏళ్లు కాదు.. 21 ఏళ్లని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ వరకూ తన వయసు ఎంత అనే విషయాన్ని దాచిన అఫ్రిది.. ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్' అనే బుక్‌లో తన వయసు 1996 నాటికి 21 ఏళ్లు అని చెప్పాడు.

వయసు నెంబరు మాత్రమే సోదరా:
ఇటీవల షాహిద్ అఫ్రిదినే ఓ అభిమాని 'మీ వయసు ఎంత..?' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. కానీ ఇప్పటికీ నిజమైన వయసు చెప్పేందుకు ఇష్టపడని అఫ్రిది.. 'ఏజ్ అనేది కేవలం ఒక నెంబరు మాత్రమే సోదరా' అని సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే మరో అభిమాని 'లాలా మీ ఫోన్ నెంబరు చెప్పండి. జీవితంలో కనీసం ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా' అని ట్వీట్ చేయగా.. '12345678910' అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.
India vs England: 'ఇంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్‌లో.. నేను ఇప్పటి వరకూ ఆడలేదు'


Click it and Unblock the Notifications
