Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: సీఎస్‌కే రికార్డులు.. ఇతర జట్లు బద్దలు చేయడం దేవుడెరుగు కనీసం టచ్ చేయలేవు!

4 Unbreakable records set by the Chennai Super Kings in IPL

హైదరాబాద్: 11 సీజన్లు మూడు సార్లు విజేత.. ఐదు సార్లు రన్నరప్.. ఓసారి సెమీస్.. మరోసారి ప్లే ఆఫ్స్.. ఇంకోసారి అట్టర్ ఫ్లాఫ్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు ఇది. స్పాట్ ఫిక్సింగ్ మకిలి అంటుకున్నా.. రెండేళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా.. ఆట పరంగా మాత్రం సీఎస్‌కే స్థాయి ఎవరెస్ట్.. మిగతా ఫ్రాంచైజీల మాదిరిగా వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్ ప్లేయర్లు లభించకపోయినా..కేవలం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్ల అనుభవంతోనే టైటిల్స్‌ను కొల్లగొట్టడం చెన్నై స్పెషాలిటీ.. మరీ ముఖ్యంగా కూల్ కెప్టెన్ మహేంద్రుడి మాయాజాలం చెన్నైకి అన్నిటికంటే పెద్ద మహిమ. ధోనీ అండతోనే చెన్నై లీగ్‌లో దుమ్మురేపింది. కరోనాతో ఆగిపోయిన ఈ సీజన్‌లోనూ అదరగొట్టింది. గత సీజన్ పేలవ ప్రదర్శన మినహా ప్రతీ ఏడాది ఎల్లో ఆర్మీ సత్తాచాటింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది. అయితే 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు నెలకొల్పిన ఓ నాలుగు అరుదైన రికార్డులు పదిలంగా ఉండనున్నాయి. వాటిని ఇతర జట్లు బద్దలు చేయడం దేవుడెరుగు కనీసం టచ్ కూడా చేయలేవు. ఆ అన్‌బ్రేకబుల్ రికార్డుల గురించి తెలుసుకుందాం!

వరుసగా మూడు టైటిళ్లు..

వరుసగా మూడు టైటిళ్లు..

చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు టైటిళ్లు గెలిచింది. ఇందులో రెండు ఐపీఎల్ ట్రోఫీలు ఉండగా మరొకటి చాంపియన్స్ లీగ్ టైటిల్ ఉంది. 2008 అరంగేట్ర సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై.. విదేశాల్లో జరిగిన 2009 సీజన్‌లో సెమీస్‌కే పరిమితమైంది. ఇక భారత్ వేదికగా జరిగిన 2010 సీజన్‌లో దుమ్మురేపిన ధోనీ సేన.. చాంపియన్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది వరల్డ్ బెస్ట్ టీ20 టీమ్స్ మధ్య జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20‌లోనూ సత్తాచాటి మరో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఇక 2011 ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై చాంపియన్‌గా నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ 2013లో ఐపీఎల్ టైటిల్‌తో పాటు చాంపియన్స్ లీగ్ ట్రోఫీ గెలిచినప్పటికీ 2014లో టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. సీఎస్‌కే‌లా వరుసగా 3 టైటిల్స్ గెలవడం భవిష్యత్తులో మరే జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ చేద్దామని ప్రయత్నించినా.. చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరగడం లేదు.

వరుసగా 10 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు..

వరుసగా 10 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు..

ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే గతేడాది మినహా ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2008 అరంగేట్ర సీజన్ నుంచి 2019 సీజన్ వరకు చెన్నై జైత్రయాత్ర అప్రతహితంగా సాగింది. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో బ్యాన్‌కు గురైంది. ఈ రెండు సీజన్లు మినహా 2019 వరకు ఆడిన ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇందులో 2010, 2011, 2018 టైటిల్స్ గెలిచిన ధోనీ సేన.. 2008, 2012, 2013, 2015, 2019 ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2009లో సెమీస్‌కే పరిమితమైన ఆ జట్టు..2014 ప్లే ఆఫ్స్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే ఇలా వరుసగా 10 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరడం ఏ జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. చివరకు ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు కూడా సాధ్యం కాలేదు. ఒకే వేళ ఆ జట్టు 10 సార్లు ప్లే ఆఫ్స్ చేరినా.. వరుసగా సాధించడం కష్టమే.

116 రన్స్ కాపాడుకున్న టీమ్..

116 రన్స్ కాపాడుకున్న టీమ్..

ధనాధన్ పరుగుల మోత మోగే ఐపీఎల్‌లో చెన్నై ఓసారి 116 పరుగులను కాపాడుకొని విజయాన్నందుకుంది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోలో ఓ జట్టు కాపాడుకున్న అత్యల్ప స్కోర్ ఇదే. 2009 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అలియాస్ కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ 116 పరుగులకే పరిమితమైంది. అనంతరం ధోనీ తన మ్యాజిక్ కెప్టెన్సీతో పంజాబ్‌ను 92 పరుగులకే పరిమితం చేసి అద్భుత విజయాన్నందించాడు. రవిచంద్రన్ అశ్విన్(2/13), ముత్తయ్య మురళీ ధరన్(2/8), సురేశ్ రైనా(2/17) స్పిన్ మాయాజాలంతో ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈ ఘనతను ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇది కష్టమే.

ఒకే సీజన్‌లో బ్రావో 32 వికెట్లు..

ఒకే సీజన్‌లో బ్రావో 32 వికెట్లు..

ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్‌లో బ్రావో 32 వికెట్లతో ఈ ఘనతను అందుకున్నాడు. అప్పటి నుంచి ఈ రికార్డు మళ్లీ చెక్కు చెదరలేదు. బ్రావోను ధోనీ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా వాడుకోవడంతో అతనికి వికెట్లు దక్కాయి. స్లో యార్కర్స్, యార్కర్లు, ఆఫ్ కట్టర్స్‌ వేయడంలో దిట్ట అయిన బ్రావో.. బౌలింగ్‌లో ఎన్నో వేరియేషన్స్ చూపిస్తాడు. దాంతోనే అతను డెత్ ఓవర్లలో వికెట్లు సాధించాడు. బ్రావో తర్వాత గత సీజన్‌లో రబడా 30 వికెట్ల మార్క్ అందుకున్నాడు. కానీ బ్రావోను అధిగమించలేకపోయాడు. బ్యాటింగ్‌‌కు మరింత ఫేవర్‌గా మారిన గేమ్‌లో బ్రావో రికార్డును బ్రేక్ చేయడం అంత సులువైన పనికాదు.

Story first published: Sunday, May 23, 2021, 18:10 [IST]
Other articles published on May 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+