IND vs SL:తొలి టీ20 టర్నింగ్ పాయింట్ అదే.. భారత్ విజయానికి కారణాలు ఇవే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్‌లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ బోణీ కొట్టింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గబ్బర్ సేన 38 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు.
అనంతరం శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా అంతా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో లంక పతనాన్నిశాసించగా.. దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16)తలో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ దశలో శ్రీలంక పటిష్టంగా కనిపించింది. కానీ స్పిన్నర్ల మాయకు పేసర్లు కట్టుదిట్టమైన బంతులు తోడవడంతో భారత విజయం లాంఛనమైంది. ముఖ్యంగా భారత్ విజయానికి నాలుగు కారణాలున్నాయి.

సూర్య సూపర్ ఫీఫ్టీ..
సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫిఫ్టీ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అవును 55/2 క్లిష్ట స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య ధనాధన్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై దాడికి దిగాడు. ఇది భారత జట్టుపై నెలకొన్న ఒత్తిడిని తగ్గించింది. ముఖ్యంగా కెప్టెన్ శిఖర్ ధావన్ స్వేచ్చగా ఆడేలా చేసింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ధావన్ కూడా తెలిపాడు. ఈ పర్యటనలో నిలకడగా రాణిస్తున్న సూర్య ఈ మ్యాచ్‌లోను తన ఫామ్‌ను కొనసాగించాడు. అతని హాఫ్ సెంచరీతోనే భారత్ 164 పరుగులు చేయగలింది. అతను ఉన్నంతసేపు స్కోర్ బోర్డు పరుగెత్తింది. అతని ఔటయ్యేకే స్కోర్ వేగం తగ్గింది. శిఖర్ ధావన్ క్లాస్ ఇన్నింగ్స్ కూడా భారత్‌కు కలిసొచ్చిందని చెప్పవచ్చు. సంజూతో అతను 51 పరుగులు, సూర్యతో 62 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు.

చహల్.. టర్నింగ్ పాయింట్
యుజువేంద్ర చాహల్ అద్భుత స్పెల్ కూడా భారత విజయానికి కలిసొచ్చింది. 4 ఓవర్లు వేసిన చాహల్ 4.75 ఎకానమీతో 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసాడు. అది కూడా ఆరంభంలోనే తీయడంతో శ్రీలంకపై ఒత్తిడి నెలకొంది. మిడిల్ ఓవర్లలో అతని పొదుపైన బౌలింగ్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా అతను వేసిన 15వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పటికే ధాటిగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన చరిత్ అసలంక(43)కు చాహల్ పరుగులివ్వకుండా కట్టడి చేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో అలసంక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతో దీపక్ చాహర్ వేసిన మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ భారత్‌వైపు తిరిగింది.

చెలరేగిన భువనేశ్వర్..
ఇక వన్డే సిరీస్‌లో తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించని భువనేశ్వర్ కుమార్.. ఫస్ట్ టీ20లో తన సత్తా ఏంటో చూపించాడు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత స్లాగ్ ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. 3.3 ఓవర్లు వేసిన భువీ.. 22 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తన చివరి ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముఖ్యంగా డేంజరెస్ అవిష్కా ఫెర్నాండోను స్లోయర్ బంతితో బోల్తా కొట్టించాడు. స్లాగ్ ఓవర్లలో మరో మూడు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. అతని సూపర్ బౌలింగ్ పెర్ఫామెన్స్ భారత్ విజయాన్ని సులువు చేసింది.

శ్రీలంక అనుభవలేమి..
ఇక శ్రీలంక ఆటగాళ్ల అనుభవలేమితనం భారత్‌కు కలిసొచ్చింది. బౌలింగ్‌లో సత్తా చాటి ఫించ్ హిట్టర్లున్న భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఆ జట్టు బ్యాటింగ్‌లో మాత్రం రాణించలేకపోయింది. భారత బౌలర్లను అంచనా వేయడంలో విఫలమై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇక్కడ చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడం మరిచిపోయింది. అదే ఆ జట్టు కొంప ముంచింది. భారత్‌సైతం వికెట్లు కోల్పోయినప్పటికీ కొన్ని మెరుగైన భాగస్వామ్యాలు ఆ జట్టుకు సాధారణ స్కోర్ చేసేలా చేశాయి. కానీ శ్రీలంక మాత్రం అనుభవంలేమి బ్యాటింగ్ ఆర్డర్‌తో మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications