Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH కొంపముంచిన తప్పిదాలు ఇవే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అసాధారణ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఆ తర్వాత విధ్వంసకర బ్యాటింగ్‌తో అలవోక విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాబ్ బలమే.. బలహీనమైంది. దూకుడు మంత్రం దెబ్బకొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లీగ్ ఆరంభంలోనే ఎదురైన ఈ పరాజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ లుకలకలను భయటపెట్టింది. నికోలస్ పూరన్ విధ్వంసంతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత బౌలింగ్.. పతనాన్ని శాసించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కాస్త అదృష్టం కూడా కలిసి రాలేదు. బౌలింగ్ విభాగం వైఫల్యంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు తగిన ప్రణాళికలు రచించకపోవడం సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాయి.

4 Reasons Sunrisers Hyderabad Lost To LSG In IPL 2025

1. దెబ్బతీసిన శార్దూల్ ఠాకూర్..
ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను శార్దూల్ ఠాకూర్ దెబ్బతీసాడు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ(6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్‌రైజర్స్ పరుగుల విధ్వంసానికి గండి పడింది. ప్రణాళిక బద్దంగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలతో ఈ ఇద్దరి బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. ఈ ఇద్దరిలో ఒకరు పవర్ ప్లే పూర్తయ్యేవరకు ఆడినా ఫలితం మరోలా

2. మలుపు తిప్పిన ప్రిన్స్ యాదవ్..
ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా... నితీష్ కుమార్ రెడ్డి సాయంతో ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో చెలరేగి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కానీ ట్రావిస్ హెడ్‌కు నితీష్ కుమార్ రెడ్డి నుంచి సరైన సహకారం లభించలేదు. బౌండరీలు బాదడంలో నితీష్ కుమార్ రెడ్డి తడబడ్డాడు. మరోవైపు దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం హెన్రీచ్ క్లాసెన్‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్రిన్స్ యాదవ్ చేతుల నుంచి జారిన బంతి నాన్‌స్ట్రైకర్ వికెట్లను తాకింది. దాంతో హెన్రీచ్ క్లాసెన్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. క్లాసెన్ కాసేపు ఉన్నా.. ట్రావిస్ ఔటవ్వకపోయినా.. సన్‌రైజర్స్ అదనంగా మరో 30 పరుగులు చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.

3.పూరన్ విధ్వంసం
నికోలస్ పూరన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. మార్క్‌రమ్ త్వరగానే ఔటైనా.. మిచెల్ మార్ష్‌తో కలిసి పూరన్ ఆకాశమే హద్దుగా చెలరగాడు. సిమర్జిత్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో 17 పరుగులు పిండుకున్న పూరన్.. 7-10 ఓవర్ల మధ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడమ్ జంపా ఓవర్‌లో 19, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 15 పరుగులు బాది 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి అతను 43 బంతుల్లోనే 116 పరుగుల భాగస్వామ్యం జోడించి లక్నో విజయానికి బాటలు వేసాడు.

4. తేలిపోయిన బౌలర్లు..
లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంలో సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోయారు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే 77 పరుగులు చేసింది. ముఖ్యంగా పూరన్‌ను కట్టడి చేయలేకపోయాడు. మిడ్ వికెట్, డీప్ మిడ్ వికెట్ దిశగా ఎక్కువగా షాట్స్ ఆడిన అతన్ని అడ్డుకోలేకపోయారు. లక్నో బ్యాటర్లకు తగ్గట్లు బౌలింగ్ వేయడంలో సన్‌రైజర్స్ బౌలర్లు తడబడ్డారు. చివరకు పూరన్, మార్ష్‌ను కమిన్స్ ఔట్ చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరంభంలోనే పూరన్‌ను ఔట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

{embed-poll}

Story first published: Friday, March 28, 2025, 10:03 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+